Connect with us

News

వెంకట్ ఆళ్ల అధ్యక్షులుగా Los Angeles NRI TDP ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం

Published

on

తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర లో మొట్టమొదటిసారిగా అమెరికా సహా వివిధ దేశాలలోని అనేక పట్టణాలకు NRI TDP కమిటీలను ప్రకటించినది. రాబోవు రెండు సంవత్సరాలలో ఈ కమిటీలు తెలుగు రాష్ట్రాలలోని రాష్ట్ర, జిల్లా, గ్రామ కమిటీలతో అనుసంధానమై పనిచేసి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావటానికి కృషి చేయబోతున్నాయి.

ఈ కమిటీల ముఖ్య ఉద్దేశ్యం అనేక దేశాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులను, సానుభూతిపరులను ఒక తాటిపైకి తీసుకువచ్చి, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలగొట్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం టిడిపిని అధికారంలోకి తీసుకు రావటం.అందులో భాగంగా లాస్ ఏంజలెస్ ఎన్నారై టీడీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ప్రకటించడం జరిగింది.

వెంకట్ ఆళ్ల అధ్యక్షులుగా, సురేష్ అంబటి ఉపాధ్యక్షులుగా, రాహుల్ వాసిరెడ్డి సెక్రెటరీగా, విష్ణు అటుకారి ట్రెజరర్ గా, హేమకుమార్ గొట్టి సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా, చందు నంగినేని రీజనల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా నియమించడం జరిగింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected