Connect with us

News

లాస్ ఏంజలస్ లో టీడీపీ అభిమానులతో మాజీ మంత్రి ఆలపాటి రాజా, గాలి భాను ప్రకాష్ సమావేశం

Published

on

లాస్ ఏంజలస్ నగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఆలపాటి రాజా మరియు గాలి భాను ప్రకాష్ లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 17 ఆదివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు పలువురు పాల్గొన్నారు.

మొదటగా విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆలపాటి రాజా మరియు గాలి భాను ప్రకాష్ పూలదండలతో నివాళుర్పించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే వివిధ ప్రశ్నలకు ఆలపాటి రాజా మరియు గాలి భాను ప్రకాష్ సమాధానాలు అందించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా భాను ప్రకాష్ అందరికి వివరించారు. విశ్చలవిడిగా తెలుగుదేశం పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, భయబ్రాంతులకు గురిచేయడం వంటి విషయాలను తెలియజేసారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ని గట్టెక్కించే సామర్ధ్యం చంద్రబాబుకే ఉందని ఆలపాటి స్పష్టం చేశారు. రాష్ట్ర మేలు కోసం వచ్చే ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు కూడా టీడీపీ విజయానికి సహకరించాలని ఆలపాటి కోరారు. అందుకు కావలిసిన తమ సహాయసహకారాలు తప్పకుండా ఉంటాయని అన్నారు.

ఈ సందర్భంగా అందరూ కలిసి తమ అభిమాన నాయకులను శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. అహులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా తేనీటి విందుతో కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected