నందమూరి తారకరామారావు 97వ జయంతి సందర్భంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లోని 10 వేల పేద కుటుంబాలకు ఎన్నారై తెదేపా సాయం చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 13 జిల్లాల్లోని ముఖ్య నగరాల్లో పదివేల నిరుపేద బ్రాహ్మణ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బిసికుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమాన్ని రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, విజయవాడలో గద్దె రామ్మోహన్, బోండా ఉమా, విజయనగరంలో అశోక్‌గజపతిరాజు, నందిగామలో తంగిరాల సౌమ్య, తణుకులో ఆరుమిల్లి రాధాకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్, పెదకాకానిలో దూళిపాళ్ల నరేంద్ర, అమరావతి, గుంటూరులో కోవెలమూడి నాని, ఉప్పుటూరి సీతామహాలక్ష్మీ, దొడ్డపనేని రాజేంద్ర, మాడుగు, శ్రీకాకుళంలో పైలా ప్రసాద్ మరియు తిరుపతి, నెల్లూరు, ప్రత్తిపాడు, ఒంగోలు, పర్చూరు, మదనపల్లి, అధోని, శింగనమల, రాజంపేట, ప్రొద్దుటూరు, అద్దంకి, రాజాం, నర్సీపట్నం లో టీడీపీ ఇంచార్జులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సంవత్సరం మహానాడులో భాగమైన ఎన్నారై టీడీపీ, జన్మభూమి రుణం తీర్చుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది అంటూ అందరూ అభినందించారు.