తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని మరియు తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పిన మహనీయుడు, అన్న విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరాముని శత జయంతి ని పురస్కరించుకొని దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్ నగరం లో స్థానిక NRI టీడీపీ సెల్ ఆధ్వర్యంలో వినూత్నమైన సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
రెండు గంటలు పైగా అడిలైడ్ నగర వీధుల్లో ఉత్సాహం గా సైకిల్ ని తొక్కుతూ నగరం అంతా ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపుని ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ విశిష్ట ను చాటి చెబుతూ తెలుగుదేశం జెండాలు చేతబూని, ఎన్టీఆర్ మరియు పార్టీ పాటలతో జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం, జై బాలయ్య నినాదలతో హోరు ఎత్తించారు.
స్థానికులు (ఆస్ట్రేలియన్స్ )సైతం ర్యాలీ గా వెళ్తున్న తెలుగుదేశం అభిమానులను చూస్తూ ఉత్సాహంగా చేతులు ఊపుతూ, తమ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్బంగా పలువురు NRI టీడీపీ సభ్యులు మాట్లాడుతూ.. మే 28న అడిలైడ్ నగరంలో శక పురుషుడికి శత వసంతాల పండుగ ఘనంగా నిర్వహించబోతున్నాం అని తెలియజేశారు.
అందులో భాగంగా ఈ వినూత్నమైన సైకిల్ ని తొక్కుతూ శత జయంతి పండుగ ముఖ్య ఉద్దేశాన్ని తెలపడమే కాకుండా ఎన్టీఆర్ విశిష్టత, ఖ్యాతి స్థానికులకు తెలియ చెప్పాలి అనే ఉద్దేశం తో నగరం లో ర్యాలీ చేప్పటాం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి మే 28 న నందమూరి కుటుంబ సభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి గారు మరియు చిన్న కుమార్తె తేజస్విని పాల్గొంటున్నారు అని కమిటీ సభ్యులు తెలిపారు.