Connect with us

Telugu Desam Party

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై NRI TDP Chicago నిరసన

Published

on

ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాసి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ ఎన్ఆర్ఐ టీడీపీ చికాగో అధ్వర్యంలో తెలుగుదేశం అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు We Stand With CBN స్లొగన్స్ తో బాబు గారికి మద్దతు తెలుపుతూ జగన్ నిరంకుశ విధానాలని నిరసిస్తూ ఇది ఒక బ్లాక్ డే గా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి (Chief Minister) గా చేసిన వ్యక్తిని FIR లో పేరు లేకుండా, గవర్నర్ అనుమతి తీసుకోకుండా కేవలం రాజకీయ కక్ష పూరితంగా అర్థరాత్రి నుంచి వేదిస్తు అరెస్ట్ చేయడాన్ని గట్టిగా ఖండించారు. మళ్ళీ రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే బాబు (Nara Chandrababu Naidu) రావాలి అని నినదించారు.

ఈ నిరసన కార్యక్రమంలో లోకల్ టీడీపీ (TDP) సీనియర్ నాయకులు హేమ కానూరు, అధ్యక్షులు రవి కాకర, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ పెదమల్లు, హను చెరుకూరి, చిరంజీవి గల్లా, హరీష్ జమ్ముల, శ్రీనివాస్ అట్లూరి, శ్రీహర్ష గరికిపాటి, అరవింద్ కోగంటి, సునీల్ అరుమిల్లి, లక్ష్మణ్ గుండపునేని, మనోహర్ పాములపాటి, శివ అడుసుమిల్లి, వంశీ జొన్నలగడ్డ, రవి మల్లవరపు, నాగేంద్ర, అనిల్, సురేష్, గిరి, సీతారాం తదితరులు తమ నేతకు సంఘీభావాన్ని ప్రకటించారు.

error: NRI2NRI.COM copyright content is protected