Connect with us

News

Atlanta దమ్ము చూపిన తెలుగు తమ్ముళ్లు & జనసైనికులు; ఆకాశమే హద్దుగా కూటమి విజయగర్జన

Published

on

. ప్రజా విజయం పేరిట విజయగర్జన @ Atlanta
. 2000 మందికి పైగా ప్రవాసులు హాజరు
. 500 కార్లతో అతి పెద్ద ర్యాలీ
. TDP, JSP, BJP నినాదాలతో హోరెత్తిన ప్రాంగణం
. ఆంధ్ర నుంచి ఎమ్మెల్యేలు, నాయకుల సందేశం
. అట్లాంటా దమ్ము చూపిన NRI TDP Atlanta & Team Atlanta Janasena
. ఆకలి మీద ఉన్న పులికి దొరికిన విందులా విజయదరహాసం
. కలిసి ఉంటే కలదు సుఖం నానుడిని నిజం చేసిన వైనం

. మీడియా మొఘల్ రామోజీ రావు కి ఘన నివాళి

ఈ మధ్యనే ముగిసిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమి (NDA) సునామీ సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అమెరికాలోని అట్లాంటా (Atlanta) మహానగరంలో తెలుగు తమ్ముళ్లు (NRI TDP Atlanta) మరియు జనసైనికులు (Team Atlanta Janasena) కలిసి ప్రజా విజయం పేరిట విజయగర్జన వేడుకలు నిర్వహించారు.

జూన్ 22 శనివారం రోజున జార్జియా రాష్ట్రం, అట్లాంటా (Atlanta) లోని జేడ్ బాంక్వెట్ హాల్లో ఈ విజయోత్సవ వేడుకలు (Victory Celebrations) పెద్ద ఎత్తున నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయంలో దాదాపు 500 కార్లతో డులూత్ రోడ్లలో అతి పెద్ద ర్యాలీ నిర్వహించారు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ బ్యానర్లు, జండాలు, కండువాలతో నినాదాలు చేశారు.

జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ, జయహో (National Democratic Alliance – NDA) కూటమి అంటూ హోరెత్తించారు. పోలీస్ సెక్యూరిటీ నడుమ కూటమి పార్టీల పాటలతో కొందరు కార్లపైకి ఎక్కి మరీ నినాదాలు చేశారు. మాంచి ఆకలి మీద ఉన్న పులికి దొరికిన విందులా ఈ కూటమి విజయాన్ని ఆస్వాదించారు.

తేనీటి విందు అనంతరం మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి డప్పులతో, తీన్మార్ డాన్సులతో వేదిక ప్రాంగణంలోకి ఊరేగింపుగా విచ్చేశారు. వేదిక ప్రాంగణం అంతా బ్యానర్లు, జండాలు, కండువాలతో పసుపు, ఎరుపు రంగుల మయమైంది. ఆహ్వానితులు సైతం పసుపు, ఎరుపు రంగుల వస్త్రాల్లో రావడం విశేషం.

అందరూ ఆశీనులైన అనంతరం వ్యాఖ్యాతలు సురేష్ పెద్ది మరియు సురేష్ కరోతు అందరికీ స్వాగతం పలికారు. ఇండియా నుంచి విచ్చేసిన పెద్దలు, మహిళలతో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని శుభప్రదంగా ప్రారంభించారు. ముందుగా ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) నాయకులు సతీష్ ముసునూరి స్వాగతోపన్యాసం చేశారు.

ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు (MLAs), టీడీపీ (Telugu Desam Party) మరియు జనసేన (Jana Sena Party) లీడర్లు పంపిన పలు వీడియో సందేశాలను ప్రదర్శించారు. వీరందరూ ఎన్నికల సమయంలో ఎన్నారైలు చేసిన కృషిని అభినందించారు. మున్ముందు కూడా రాష్ట్ర అభివృద్హిలో పాలుపంచుకోవాలని కోరారు.

అనంతరం గాయకులు సందీప్ కూరపాటి పుణ్యభూమి నా దేశం అంటూ ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) పాటతో మొదలుపెట్టి, టీడీపీ, జనసేన పార్టీల పాటలతో ఉర్రూతలూగించారు. ఆహ్వానితులు సైతం తమ సీట్లలో నుంచి పైకి లేచి ఈలలు, అరుపులతో జెండాలు ఎగరవేస్తూ వాతావరణాన్ని అత్యంత కోలాహలంగా మార్చారు.

అలాగే చందు ప్రత్యేక డాన్స్ షో, రోబో గణేష్ రోబో తరహా డాన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తర్వాత కీ నోట్ స్పీకర్స్ మల్లిక్ మేదరమెట్ల, సురేష్ కరోతు, క్రిష్ణప్రియ తదితరులు ప్రసంగించారు. ఫుడ్ కోఆర్డినేటర్ వేణు దండా ఫుడ్ స్పాన్సర్స్ అందరినీ పేరు పేరునా అభినందించారు. మొట్టమొదటిసారి అట్లాంటా (Atlanta) లోని రెస్టారెంట్స్ అన్నీ కలిసికట్టుగా ముందుకు రావడం విశేషం అన్నారు.

తదనంతరం ప్రముఖ మిమిక్రీ కళాకారులు రమేష్ (Mimicry Ramesh) తనదైన స్టైల్ లో పలువురు రాజకీయ నాయకులను మరియు సినీ రంగానికి చెందిన నటీనటులను అనుకరిస్తూ సభలో నవ్వులు పూయించారు. మధ్యలో పాటలు కూడా పాడుతూ అందరినీ అలరించారు.

మధ్య మధ్యలో జై అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు (Pawan Kalyan), జై లోకేష్, జై బాలయ్య, జై కూటమి అంటూ కిక్కోచ్చేలా నినాదాలు చేశారు. అందరూ ముక్తకంఠంతో మద్దతు తెలుపుతూ ఆస్వాదించారు.

కూర్చోవడానికి కుర్చీలు కూడా సరిపోనంత జనం రావడం ఒక ఎత్తైతే, నుంచొని కూడా కార్యక్రమం ఆసాంతం తిలకించిన ప్రవాసులు మరొక ఎత్తు. పసందైన విందు భోజనం అనంతరం బాణసంచా కాల్చారు. ముందే ఊహించి 2000 మందికి సరిపడా ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో నిర్వాహకులను అభినందించాల్సిందే.

టీమ్ అట్లాంటా జనసేన (Team Atlanta Janasena) మరియు ఎన్నారై టీడీపీ (NRI TDP Atlanta) నుంచి పలువురు నాయకులు వివిధ మీడియా ఛానళ్ళతో మాట్లాడుతూ కలిసి ఉంటే కలదు సుఖం నానుడిని నిజం చేస్తూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఇదంతా ఆరంభం మాత్రమే అని, నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం సమైక్యంగా ముందుకు వెళుతూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిగా నిలుపుతుందన్నారు.

ఈ మధ్యనే కాలం చెందిన మీడియా మొఘల్, అక్షరాన్నే ఆయుధంగా మార్చిన యోధుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీ రావు (Cherukuri Ramoji Rao) కి నివాళులు అర్పిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.

అట్లాంటా వాసి, అందరికీ సుపరిచితులు, గుడివాడ గడ్డపై తెలుగుదేశం జండాని రెపరెపలాడించిన రాము వెనిగండ్ల (Ramu Venigandla) జూమ్ మీటింగ్ ద్వారా లైవ్ లోకి వచ్చి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ప్రశాంతిస్తూ ఎన్నారైల సేవలను, ముఖ్యంగా అట్లాంటా (Atlanta) వారి సేవలను అభినందించడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏ సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని అన్నారు.

భోజనాల అనంతరం ఎన్నారై టీడీపీ అట్లాంటా (NRI TDP Atlanta) మరియు టీం అట్లాంటా జనసేన (Team Atlanta Janasena) నాయకుల నడుమ కూటమి కేక్ కట్ చేసి అందరికీ పంచారు. తదనంతరం మరోసారి మిమిక్రీ రమేష్, రోబో గణేష్ తమ ప్రదర్శనతో అలరించారు. ఇక క్లైమాక్స్ లో గాయనీ గాయకులు శ్రీ ప్రజ్ఞ, సందీప్ కూరపాటి మరియు జనార్దన్ పన్నెల చక్కని పాటలతో సంగీత విభావరి (Musical Concert) నిర్వహించారు.

చివరిగా శ్యామ్ మల్లవరపు మరియు రాజు మందపాటి వందన సమర్పణ (Vote of Thanks) లో భాగంగా వాలంటీర్స్, ఫుడ్ స్పాన్సర్స్, ఆర్ధిక సహాయం అందించిన దాతలు, జేడ్ బాంక్వెట్ యాజమాన్యం, మీడియా పార్టనర్స్, LED స్క్రీన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలందించిన బైట్గ్రాఫ్ ప్రశాంత్, ఎన్నారై టీడీపీ అట్లాంటా మరియు టీం అట్లాంటా జనసేన నాయకులు, కార్యకర్తలు ఇలా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపి కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయదరహాసాన్ని అమెరికాలోని అట్లాంటా (Atlanta) మహానగరంలో చాటిన ఈ విజయోత్సవ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/TDP JSP BJP Kutami Victory Celebrations in Atlanta ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected