Connect with us

News

శ్రీనివాస్ గుత్తికొండ దాతృత్వం; వరద బాధితుల సహాయార్ధం కోటి విరాళం @ Vijayawada, Andhra Pradesh

Published

on

ప్రముఖ ప్రవాసులు శ్రీనివాస్ గుత్తికొండ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర వరద బాధితుల సహాయార్ధం కోటి రూపాయల విరాళం అందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడ (Vijayawada) లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండగా ప్రత్యక్షంగా కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ (AP CM Relief Fund) కోసం కోటి రూపాయల చెక్కును అందించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి (Tampa, Florida) చెందిన ఎన్నారై శ్రీనివాస్ గుత్తికొండ వరద బాధితుల సహాయార్ధం ఇప్పుడే కోటి రూపాయల విరాళం అందించడానికి వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చంద్రబాబు (Nara Chandrababu Naidu) అన్నారు.

శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) ఇంతకు ముందు హుద్ హుద్, తిత్లి తుఫానుల సమయంలో కూడా విరాళాలు (Donations) అందించారని, సత్య ప్రమాణాలకు నిలువైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానాన్ని పునర్నిర్మాణం గావించారని తెలిపారు. తన గొప్ప మనసుతో ఎప్పటికప్పుడు సహాయం చేస్తున్నారన్నారు.

శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) ని ఆదర్శంగా తీసుకొని అందరూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వరద బాధితులను ఆదుకునేలా తప్పకుండా ముందుకు రావాలని అభ్యర్ధించారు. ఇంకా ప్రభుత్వం తరపున తాము చేసేది చేస్తున్నామని, మిగతావారు కూడా తమకు తోచినంతగా ఈ కష్టకాలంలో ప్రజలకు (Flood Victims) సహాయసహకారాలు ముమ్మరంగా అందించాలన్నారు.

అలాగే ఎన్నారై శ్రీనివాస్ గుత్తికొండ మాట్లాడుతూ… తనకు వీలైనంతలో ఉడతాభక్తిగా విరాళం అందించానన్నారు. ఈ వరదల కష్టకాలంలో మన ఆంధ్ర రాష్ట్ర (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రాత్రనకా పగలనకా రిస్క్ తీసుకొని మరీ క్రైసిస్ ని చక్కగా మేనేజ్ (Crisis Management) చేస్తూ పనిచేయడం అభినందనీయమన్నారు.

థాంక్ యు సీఎం సర్ అంటూ చంద్రబాబుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) మాజీ ఛైర్మన్, 2025 నాట్స్ సంబరాల కన్వీనర్ అయినటువంటి శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) తోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ ప్రసాద్ గొట్టిపాటి (Ramakrishna Prasad Gottipati) కూడా పాల్గొన్నారు. సామాన్యంగా చంద్రబాబు (Nara Chandrababu Naidu) పొగడడం అరుదు, అలాంటిది మీడియా పాయింట్ లో పక్కనే పెట్టుకొని శ్రీనివాస్ గుత్తికొండ ని అభినందించడం విశేషం.

error: NRI2NRI.COM copyright content is protected