ఖమ్మం జిల్లా, కొత్తగూడెం (Kothagudem, Khammam) మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఐరన్ బీరువాలు, చైర్స్ మరియు ఫర్నిచర్ అందజేశారు తానా (TANA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి. స్కూల్ అభివృద్ధికి సహకరించమని కోరగానే రవి పొట్లూరి వెంటనే స్పందించి సహాయం అందించి సహకరించారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ (Mandal Parishad Primary School) విద్యార్థులు, ఉపాధ్యాయుల తరపున ఉపాధ్యాయుడు బండి నాగేశ్వర్ రావు తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri) కి ధన్యవాదాలు తెలిపారు.