Connect with us

News

తానా బోర్డు సభ్యులు వెంకట్ కోగంటి కి మాతృవియోగం, ప్రముఖుల నివాళులు @ Kanchikacherla, Andhra Pradesh

Published

on

Kanchikacherla, Andhra Pradesh: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డు డైరెక్టర్ వెంకట్ కోగంటి (Venkat Koganti) మాతృమూర్తి కోగంటి సరోజినికి ( Koganti Sarojini) పలువురు ఎన్నారైలు, తానా నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇతరులు ఘనంగా నివాళులర్పించారు. కంచికచర్ల ఓసీ క్లబ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నివాళులర్పించారు.

అమెరికాలోని ఎన్నారై స్పెషల్ రిప్రజెంటేటివ్ జయరామ్ కోమటి, (Komati Jayaram), ఎపి సైన్స్, టెక్నాలజీ చైర్మన్ రవి మందలపు, తెలుగుదేశం పార్టీ (TDP) స్టేట్ సెక్రటరీ జి.వి.ఎస్ ప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు (Mannava Subbarao), మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్ రామకృష్ణ (Ramakrishna) నివాళులర్పించారు.

అలాగే అప్పసాని రాజేష్, కోమటి సుధాకర్, ఆళ్ల గోపాలకృష్ణ, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సజ్జా అజయ్, సినీ డైరెక్టర్ ఆర్టిస్ కాశీ విశ్వనాథ్, తానా టెజ్రరర్ రాజా కసుకుర్తి (Raja Kasukurthi), తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొని కోగంటి సరోజిని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఉద్యోగి కోగంటి వీరారావు (Koganti Veerarao), తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ వెంకట్ కోగంటిల కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్, Nandigama MLA తంగిరాల సౌమ్య కూడా వెంకట్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తన పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో సరోజిని పాత్ర ఎనలేనిదన్నారు. ఆమె మరణం వారి కుటుంబ సభ్యులకు తీరనిలోటని అన్నారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కోగంటి బాబు (Koganti Babu), పలువురు నాయకులు తంగిరాల సౌమ్యతో పాటు ఉన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected