Connect with us

Sports

చారిటీ కోసం నాట్స్ నిర్వహించిన Northeast Cricket Tournament విజయవంతం

Published

on

అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ బోస్టన్ టీమ్ ఆగష్టు 20న నార్త్ ఈస్ట్ క్రికెట్ (Cricket) టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ పిలుపుకు స్పందించి ఈ వన్‌డే టోర్నమెంట్‌లో తొమ్మిది జట్లు పోటీపడ్డాయి. దాదాపు 100 మందికి పైగా తెలుగు (Telugu) క్రికెట్ ప్లేయర్స్ ఇందులో పాల్గొన్నారు.

మొత్తం ఈ Northeast Cricket Tournament లో 17 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో నాలుగు టీమ్‌లను అత్యుత్తమ టీమ్‌లుగా ప్రకటించారు. అందులో మొదటి స్థానం మాస్ ఎవెంజర్స్, రెండవ స్థానంలో న్యూ ఇంగ్లాండ్ ఫైటర్స్, మూడవ స్థానంలో రాయల్ టైగర్స్, నాల్గవ స్థానంలో న్యూ హ్యాంపైర్ సూపర్ స్ట్రీకేర్స్ జట్లు నిలిచాయి. ఈ నాలుగు జట్లకు ప్రైజ్ మనీతో పాటు అత్యుత్తమ ఆటగాళ్లకు నాట్స్ బహుమతులు, ట్రోఫీలు అందించింది.

నాట్స్ బోస్టన్ తరఫున నాట్స్ కార్యనిర్వాహక సభ్యులు శ్రీనివాస్ గొంది, చాప్టర్ కోఆర్డినేటర్స్ కళ్యాణ్ కాకి, శేషి రెడ్డి పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కాళిదాస్ సూరపనేని, బాలాజీ బొమ్మిశెట్టి, భార్గవ పరకాల, వినోద్ కులకర్ణి, అశ్విన్ (డెడ్‌బాల్ లీగ్), వెంకట్ కృష్ణ శ్రీపతి, వడ్ల శ్రీనివాస్, వెంకట్ మచ్చ, అనిల్ పొట్లూరి, అనిల్ వల్లభనేని, గిరిధర్ అక్కినేని, రవి మారేడు, శ్రీనివాస్ రెడ్డి వడ్ల, అజయ్ పిన్నమనేని, ప్రకాష్ అక్కినేని, శ్రీనివాస్ బోడిచెర్ల, రాజేష్ బచ్వాల్, ఫణి (ఎం.ఎస్.సీ.ఎల్) అరుణ్ కౌల్ (మెర్రిమాక్ క్రికెట్ లీగ్), వినోద్ కులకర్ణి తదితరులు ఉన్నారు.

వీరందరిని నాట్స్ (NATS) ప్రత్యేకంగా అభినందించింది. ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌కు అంపైర్లుగా వ్యవహరించిన తండ్రి, కొడుకులు మధు పరకాల, భార్గవ పరకాలను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఇతర మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించిన శ్రీనివాస్ రెడ్డి వడ్ల, బాలాజీ బొమ్మిశెట్టిలకు నాట్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేకంగా అభినందించారు.

బోస్టన్ (Boston) టీమ్ తెలుగువారికి ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి తాజా టోర్నమెంట్ స్ఫూర్తిని ఇస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి (బాపయ్య చౌదరి) అన్నారు. ఈ టోర్నమెంట్‌కు సమోసా & మాంగో లస్సీ స్పాన్సర్ చేసిన సునీల్ – బావర్చి, ఫ్రేమింగ్‌హామ్, బిర్యానీలు, చికెన్ కర్రీ అంద చేసిన మిత్రులు క్యాటరర్స్ శ్రీనివాస్ జిడ్గే, వెంకట్ మచ్చ, జితేందర్ కరెడ్డి వారికి నాట్స్ ధన్యవాదాలు తెలిపింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected