ప్రేమతో రుచికరంగా చేసిన చేతి వంటలు, అన్ని వయసుల వారికి ఆటలు, పిల్లలకు Crafts ఇంకా చక్కని సందేశాలతో సాగిన NAPA అట్లాంటా (Atlanta) వనభోజనాలు (Picnic) పలు సభ్యులను ఆకట్టుకున్నాయి. North American Padmashali Association (NAPA) అట్లాంటా చాప్టర్ వారు మొట్టమొదటి సారి నిర్వహించిన ఈ వనభోజనాలు ఏప్రిల్ 28, 2024న Buford Dam పార్కులో జరిగాయి.
ఈ కార్యక్రమానికి దాదాపు 250 మంది హాజరై నిర్వహించిన ప్రతి పోటీలో పాల్గొనడం విశేషం. ముందుగా కార్యనిర్వాహక బృందం స్వాగతం పలికిని తరువాత (Atlanta) చాప్టర్ డైరెక్టర్ సతీష్ నందాల గారు మాట్లాడుతు ‘మన అట్లాంటా చాప్టర్ కార్యక్రమాలను ఒక మోడలుగా తీసుకుని ఇతర చాఫ్టర్లు అనుసరిస్తున్నారు’ అన్నారు.
సుధాకర్ రావిరాల గారు మెంబర్షిప్, విరాళాల గురించి, తిరు చిల్లపల్లి 2025 అట్లాంటా చాప్టర్ నిర్వహించనున్న కన్వెన్షన్ గురించి, మురళి గుడ్ల వాలంటీరింగ్ గురించి ఇంకా మాయూర్ మిట్టపల్లి ప్లాస్టిక్ వినియోగం తగ్గించమని చెప్పారు. మహిళా కోఆర్డినేటర్ జ్యోతి పున్న ఇటీవల జరుపుకున్న ‘విమెన్స్ డే’ గురించి మాట్లాడుతూ, మహిళా సభ్యులు ముందుకు వచ్చి కార్యక్రమాల్లలో వారికి సహకారాన్ని అందచేయమని కోరారు.
రూప వేముల potluck పదార్థాలు తీసుకువచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 11 గంటలకు ప్రారంభమైన మధ్యాహ్నం 4 గంటవరకు సాగిన ఈ వనభోజనాలలో సంధ్య చిలువేరు గారు పిల్లలతో craft వర్క్ చేయించడం తల్లితండ్రులను ఆకట్టుకొంది. జ్యోతి పున్న, రూప వేముల నిర్వహించిన ఆటలపోటీలు ఒక ఆకర్షణగా నిలిచాయి.
అందరు కలిసి భోజనం ఆరగించిన తరువాత పిల్లలలు, పెద్దలకు, జంటలకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అమెరికా సందర్శిస్తున్న తల్లి తండ్రులు కూడా హాజరై వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం North American Padmashali Association (NAPA) కార్యకర్తలకు ఒక ప్రోత్సాహాన్ని కలుగచేసాయి.
ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగించకుండా పర్యావరణ సంరక్షణకై మాలిని గారి ఆధ్వర్యంలో ఒక స్వచ్చంధ సంస్థ మంచి నీటిని తెచ్చి ఉచితంగా అందచేయడం విశేషం. వారిని North American Padmashali Association (NAPA) అట్లాంటా చాప్టర్ యాజమాన్యం వారు Dr. మల్లికార్జున్ సామల గారి చేతుల మీదుగా సత్కరించడం జరిగింది.
అదేవిధంగా ఆటల పోటీలో నెగ్గిన వారందరికీ తిరు చిల్లపల్లి మరియు మయూర్ మిట్టపల్లి బహుమతులను, ప్రశంస పత్రాలను అందచేశారు. చిరంజీవులు శ్రీకర్ & అక్షిత రావిరాల వాలంటీర్ సేవలను ప్రశంసనీయంగా పేర్కొనడం జరిగింది. పలు డాక్టర్లను హాజరైనవారికి పరిచయం చేసి వారి సలహాలని ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు.
కావలసిన వస్తువులు సమకూర్చడంలో సాటిలేని, ది one-and-only, మాయూర్ మిట్టపల్లి సేవలు ప్రశంసనీయం. చక్కని photographyతో అందరి మన్ననలు పొందిన మాస్టర్ ఆకాష్ గంజిని ప్రత్యేక గుర్తింపు నిచ్చి, వారిని ప్రోత్సహింసవలసిందిగా కోరారు. హాజరైన సభ్యులు వారి సంతోషాన్ని పలు విధాలుగా ప్రకటించారు.
శ్రవణ్ వేముల: గొప్ప ఈవెంట్, ప్రతి ఒక్కరూ దానిలోని అన్ని అంశాలను ఆస్వాదించారు. సతీష్ గారు చెప్పినట్లుగా, NAPA అట్లాంటా అధ్యాయం ఒక ఉదాహరణగా నిలిచింది.
శ్రీనివాస్ ఆడెపు: ఇంత చక్కటి గెట్ టుగెదర్‌ని నిర్వహించినందుకు NAPA ఎగ్జిక్యూటివ్ కమిటీకి అభినందనలు. రుచికరమైన ఆహారం, అందరినీ కలవడం ఆనందంగా ఉంది
ఆంజనేయులు గొట్టిపాముల: రుచికరమైన ఆహారం, గొప్ప వాతావరణం, చక్కగా నిర్వహించబడింది. మా NAPA తదుపరి సమావేశం కోసం ఎదురు చూస్తున్నాము.
గిరి R: ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో చాలా కృషి చేసినందుకు వాలంటీర్లు, కోఆర్డినేటర్లు మరియు స్పాన్సర్‌లందరికీ ధన్యవాదాలు. మేము చాలా ఆహ్లాదకరమైన చర్యలు మరియు వివిధ రకాల రుచికరమైన ఇంట్లో తయారు చేసిన ఆహారాలతో చాలా ఆనందించాము. చక్కటి ప్రణాళిక, వ్యవస్థీకృత మరియు అద్భుతమైన అమలు చేయడంలో సఫలమైంది నాప అట్లాంటా (Atlanta) చాప్టర్.
జనవరి 2024 నుండి నిర్విరామంగా ప్రతి నెల ఒక వినూతనమైన కార్యమాన్ని అందించాలని లక్యం పెట్టుకున్న నాపా అట్లాంటా చాప్టర్ (NAPA Atlanta Chapter) 2025 ఆగష్టు-సెప్టెంబర్లో ఆడంబరంగా కన్వెన్షన్ నిర్వహించడానికి సంసిద్ధమౌతుంది. వాలంటీర్, స్పాన్సర్షిప్, మెంబెర్షిప్ తదితర వివరాలకు చాప్టర్ డైరెక్టర్ సతీష్ నందాలను సంప్రదించవచ్చు.
మరిన్ని ఫోటోల కొరకు www.NRI2NRI.com/North American Padmashali Association Picnic in Atlanta 2024 ని సందర్శించండి.