ఉత్తర అమెరికా పద్మశాలి అసోసియేషన్ (North American Padmashali Association – NAPA) ఆధ్వర్యంలో జనవరి 28న అట్లాంటా (Atlanta) లోని మిడ్వే పార్క్ హాల్ లో సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహించారు. వణికించే చలిలో సైతం అమెరికా గడ్డపై తెలుగు సాంప్రదాయ పండుగను అత్యంత ఉత్సాహంగా రెండు వందల పైచిలుకు తెలుగు వారు వచ్చి వేడుకలను విజయవంతం చేసారు.
చిన్నపిల్లల భోగిపళ్ళతో, అందమైన రంగవల్లులతో, సాంప్రదాయ తెలుగు వారి పిండి వంటలతో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని అమెరికా గడ్డమీద చాటి చెప్పారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు మన భారతీయ తెలుగు సాంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేయటం శుభ పరిణామం.
సంక్రాంతి పండుగ తెలుగు వారికి అతి పెద్ద పండుగ, కొత్త అల్లుళ్ల రాకతో పిండి వంటల ఘుమ ఘుమలతో చక్కటి రంగవల్లుల ముగ్గులతో తెలుగు వారంతా ఒకచోట చేరి సంక్రాంతి పండుగ జరుపుకోవడం అభినందనీయం. నాప (NAPA) అట్లాంటా వారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన వేదిక అలంకరణ పండుగ ఉట్టి పడేలాగా తెలుగు సాంప్రదాయాన్ని చాటేలాగా ఎంతో సర్వాంగ సుందరంగా ఉంది అని వచ్చిన వారు అనుకోవటం విశేషం.
ఈ సందర్భంగా నాప అట్లాంటా సంఘం పిల్లలకు ముగ్గుల పోటీలు, బొమ్మల పోటీలు, వ్యాసరచన పోటీలు, ఆడవారికి, మగవారికి పలు రకాల పోటీలను నిర్వహించారు. భోగిపళ్ల వేడుకలో బాలలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తర అమెరికా పద్మశాలి సంఘం జార్జియా రాష్ట్ర (అట్లాంటా చాప్టర్) అధ్యక్షుడుగా సతీష్ నందాల ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం నూతన కార్యవర్గాన్ని నియమించారు.
విజ్జు చిలువేరు, చిల్లపల్లి నాగ తిరుమలరావు – గౌరవ సలహాదారులు సుధాకర్ రావిరాల – డైరెక్టర్ ఫైనాన్స్ మయూర్ మిట్టపల్లి – డైరెక్టర్ అడ్మిన్ జ్యోతిర్మయి పున్న – డైరెక్టర్ ఉమెన్ మురళి గుడ్ల – డైరెక్టర్ ఆపరేషన్స్ రూప వేముల మిట్టపల్లి – డైరెక్టర్ యువజన సంతోష్ – డైరెక్టర్ ఇవెంట్ మేనేజ్మెంట్
ఈ North American Padmashali Association (NAPA) కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాబురావు సామల, శ్రీనివాస్ తాటిపాముల, ప్రధీప్ సామల, నవీన్ జొన్నలగడ్డ, శ్రీ చెరుకూరి, శ్రీనివాస్ సాయని, శ్రీ చెరుకూరి, మల్లికార్జున గంజి తదితరులు హాజరైనారు.