Connect with us

Associations

అంచలంచలుగా ఎదుగుతున్న NATS; Phoenix Chapter ప్రారంభం

Published

on

Phoenix, Arizona, జూన్ 9, 2024: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS మరింతగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే కొత్తగా ఫీనిక్స్ చాప్టర్‌ని నాట్స్ ప్రారంభించింది. నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాహుల్ కోనే ఫీనిక్స్ చాప్టర్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

నాగ పడమట నాయకత్వంలో ఈ ఫీనిక్స్ చాప్టర్ (NATS Phoenix Chapter) ముందుకు సాగనుంది. సతీశ్ గంధం, వేణు దమరచద్, కిషోర్ రావు కోదాటి, అభిలు ఫీనిక్స్ చాప్టర్ సమన్వయకర్తలుగా పనిచేయనున్నారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి లు ఫీనిక్స్ లో జరిగిన చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీరు ఫీనిక్స్ నాట్స్ విభాగ (NATS Phoenix Chapter) నాయకులను అభినందించారు. ఫీనిక్స్ లో నాట్స్ కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు కావాల్సిన సహకారాన్ని నాట్స్ బోర్డ్ అందిస్తుందని ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) తెలిపారు. నాట్స్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాలంటీర్లకు నాట్స్‌లో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) అన్నారు.

ఈ కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా స్థానిక తెలుగు వారు (Telugu People) పాల్గొన్నారు. నాట్స్ ఫీనిక్స్ (Phoenix) నాయకులు నాట్స్‌ను ఫీనిక్స్ లో బలోపేతం చేస్తారనే నమ్మకం ఉందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ అనుదీప్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త నాయకత్వాన్ని అభినందించారు.

అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై డాక్టర్ సుధీర్ యార్లగడ్డ, కిరణ్ వేదాంతం స్థానిక తెలుగు వారికి అవగాహన కల్పించారు. ఫీనిక్స్ (Phoenix) లో రక్షణ, భద్రత అంశాలపై స్థానిక భద్రతాధికారి క్రిష్ పెరేజ్ ఎన్నో విలువైన సూచనలు చేశారు. రామ నిఠల విద్యార్ధుల ప్రార్థన గీతంతో ఈ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలైంది.

ఈ కార్యక్రమం ఫీనిక్స్ (Phoenix, Arizona) లో తెలుగువారికి అండగా నాట్స్ ఉందనే భరోసాను ఇచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన రవి కొమ్మినేని, వెంకటేష్ ఏనుగుల, ప్రవీణ్ రెడ్డి పాటి తదితరులకు నాట్స్ ఫీనిక్స్ చాప్టర్ నాయకుడు నాగ పడమట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected