Connect with us

Health

AP పార్వతీపురంలో ఉచిత వైద్య శిబిరం: NATS & గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ

Published

on

పార్వతీపురం, ఆంధ్రప్రదేశ్, డిసెంబర్ 20: అమెరికా లో తెలుగు వారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో (GLOW) తో కలిసి మన్యం జిల్లా లోని గిరిజన గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు (Free Health Camps) నిర్వహిస్తోంది.

తాజాగా పార్వతీపురం (Parvathipuram, Manyam District, Andhra Pradesh) లో నాట్స్ (North America Telugu Society – NATS) మరియు గ్లో (GLOW) సంస్థలు సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. ఇందులో ముఖ్యంగా విద్యార్ధుల ఆరోగ్యంపై (Students) దృష్టి సారించాయి. గిరిజన విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన మందులను (Free Medicine) ఉచితంగా అందించాయి.

గిరిజనుల సంక్షేమానికి తన వంతు చేయూత అందించేందుకు నాట్స్ (North America Telugu Society – NATS) ముందు ఉంటుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) తెలిపారు. గ్లో సంస్థ సహకారంతో గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేక అభినందనలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected