Connect with us

Convention

న్యూజెర్సీలో భారీ స్పందనతో కిక్ ఇచ్చిన నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాల కిక్ ఆఫ్ ఈవెంట్

Published

on

ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ‘నాట్స్’ ఆధ్వర్యంలో అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ ఎడిసన్ లోని ఎక్స్పో సెంటర్ లో జరుగనున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నద్ధం చేసేలా తాజాగా నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్‌కు తెలుగు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది.

న్యూజెర్సీలోని ఎడిసన్ వేదికగా జరిగిన ఈ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు వందల మంది తెలుగు ప్రజలు హాజరయ్యారు. స్థానిక సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరం వ్యవస్థాపకులు రఘుశర్మ శంకరమంచి గణేశ ప్రార్ధన, జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టారు. నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, సంబరాల కోకన్వీనర్ వసుంధర దేసు, బిందు యలమంచిలి, స్వాతి అట్లూరి, ఉమ మాకం, గాయత్రీ లు జ్యోతి ప్రజ్వలన లో పాల్గొన్నారు.

నాట్స్ అధ్యక్షులు బాపు నూతి (Bapaiah Chowdary Nuthi) 7వ నాట్స్ అమెరికా సంబరాలు 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ లో జరుగనున్నట్టు ప్రకటించి, అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని ని సభకి పరిచయం చేసారు. ఈ సందర్భంగా “భాషే రమ్యం సేవే గమ్యం” అనే నినాదంతో స్థాపించబడిన నాట్స్ సంస్థ సేవకి, భాషకి సమ ప్రాధాన్యతనిస్తూ చేస్తున్న అనేక సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను, వైద్య శిబిరాలు, కంటి శిబిరాలు ద్వారా అమెరికాలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవలను వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేశారు.

తెలుగుజాతికి నాట్స్ అండగా ఉంటుందనేది అనేక సంఘటనలు నిరూపించాయని నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి (Aruna Ganti) అన్నారు. నాట్స్ టీంలో అందరికి సమాన అవకాశాలు ఉంటాయని ఉత్సాహంగా పని చేసే ప్రతి ఒక్కరికి నాట్స్ స్వాగతం పలుకుతుందని ఆమె అన్నారు.

నాట్స్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ ఒక ప్రత్యేక మహిళా జాతీయ వింగ్ ని ఏర్పాటు చేసి ముఖ్యంగా మహిళా ఆర్ధిక స్థిరత్వం, మహిళా సమస్యలకు పరిష్కారం, చిన్న పిల్లలలో సామాజిక స్పృహ కల్పించే కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షులుతో కలిసి రూప కల్పన చేయటం జరిగిందని తెలిపారు.

అనంతరం సంబరాల కోర్ కమిటీ సభ్యులైన రాజేంద్ర అప్పలనేని – కో కన్వీనర్, వసుంధర దేసు – కో కన్వీనర్, రావు తుమ్మలపెంట (టిపి) – కోఆర్డినేటర్, విజయ్ బండ్ల – కోఆర్డినేటర్, శ్రీహరి మందాడి – డిప్యూటీ కన్వీనర్, రాజ్ అల్లాడ – డిప్యూటీ కన్వీనర్, శ్యామ్ నాళం – కాన్ఫరెన్స్ సెక్రటరీ, చక్రధర్ వోలేటి – కాన్ఫరెన్స్ ట్రెజరర్, రంజిత్ చాగంటి – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ లను సభకు పరిచయం చేశారు.

ఆ తర్వాత స్థానిక నృత్య సంస్థలైన నృత్య మాధవి స్కూల్ అఫ్ డాన్స్, సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్స్ అకాడెమీ, సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్, కవి’స్ స్కూల్ అఫ్ డాన్స్ సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, పిల్లల నృత్యాలు ఆహూతులను బాగా ఆకట్టు కున్నాయి. ప్రముఖ తెలుగు గాయకులు హేమచంద్ర, మౌనమి ల తెలుగు పాటల ప్రవాహం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలుగు సినీ పాటలతో హేమచంద్ర (Hemachandra Vedala), మౌనిమ (Mounima Chandrabhatla) లు తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపారు. ఆద్యంతం తెలుగు ఆట, పాట లతో కిక్ ఆఫ్ ఈవెంట్ ఎంతో ఉల్లాసభరింతంగా సాగింది. వినోదాలను పంచింది. వచ్చే ఏడాది మేలో జరగనున్న 7వ అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ తెలుగువారిని సన్నద్ధులను చేసే క్రమంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సారి నాట్స్ తెలుగు సంబరాలు న్యూజెర్సీ వేదికగానే అంగరంగ వైభవంగా జరిపేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది.

నాట్స్ (North America Telugu Society) ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగువారి నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని అన్నారు. తెలుగు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టేలా తాము శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.

సంబరాల అంటే కేవలం విందు, వినోదమే కాకుండా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సాటి వారికి సాయం చేసేలా సేవా దృక్పథం వంటివి అన్నీ కలగలసి ఉంటాయని శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani) అన్నారు. ఆదరణకు నోచుకోని, మరుగున పడుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించనున్నామని శ్రీధర్ తెలిపారు.

కేవలం పది రోజుల క్రితమే నాట్స్ ఇచ్చిన పిలుపుకు వందల మంది కిక్ ఆఫ్ ఈవెంట్‌కు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. ఇది అమెరికా తెలుగు సంబరాలకు కేవలం టీజర్ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీధర్ అప్పసాని ధన్యవాదాలు తెలిపారు.

రాజ్ అల్లాడ, శ్రీహరి మందాడి, శ్యాం నాళం, మురళీ కృష్ణ మేడిచెర్ల, కృష్ణ అనుమోలు, కవిత తోటకూర, గాయత్రీ, బిందు యలమంచిలి, శ్రీనివాస్ భీమినేని మరియు ఇతర సంబరాలు టీం సభ్యుల సమిష్టి కృషి వల్లే ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ విజయవంతం అయిందని శ్రీధర్ అప్పసాని తెలిపారు.

నాట్స్ డాక్యుమెంటరీ కోసం అడిగిన వెంటనే వాయిస్ ఇచ్చిన ప్రముఖ నటులు పూడిపెద్ది సాయికుమార్‌ (Sai Kumar Pudipeddi) కి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని శ్రీధర్ అప్పసాని అన్నారు. కిక్ ఆఫ్ ఈవెంట్ స్ఫూర్తితో నాట్స్ సభ్యులంతా కలిసి ఏడవ అమెరికా తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని శ్రీధర్ అప్పసాని హామీ ఇచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి, నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, డిప్యూటీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ గౌరవ బోర్డ్ సభ్యులు డా.రవి ఆలపాటి, శేఖరం కొత్త, బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, మోహన్ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, వంశీకృష్ణ వెనిగళ్ల, చంద్రశేఖర్ వెనిగళ్ల, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల, వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ & ఫైనాన్స్) భాను ధూళిపాళ్ల, వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) హరినాథ్ బుంగటావుల, వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్), మదన్ పాములపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్(నార్త్ ఈస్ట్) గురు కిరణ్ దేసు, ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ – సూర్య గుత్తికొండ ఉన్నారు.

అన్ని తెలుగు సంస్థల నుండీ పలువురు నాయకులు 7 వ అమెరికా తెలుగు సంబరాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తానా, ఆటా, నాటా, టిఎల్ సిఎ, టిఏజిడివి, టాటా, స్థానిక తెలుగు సంస్థలైన తెలుగు కళా సమితి, ఎన్.జే.టి.ఎ, కళావేదిక, ఎస్.పి.బి ల నుండి ప్రతినిధులు కిక్ ఆఫ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి దక్షిణ్ రెస్టారెంట్ వారి విందు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఈ సభకు మనోజ్ ఇరువూరి (Manoj Iruvuri), కవిత తోటకూర (Kavitha Thotakura) వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు. కృష్ణ అనుమోలు, ప్రసాద్ సింహాద్రి వీడియో, ఆడియో సహకారం అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected