Connect with us

Associations

NATS Maryland Chapter ప్రారంభం, ఉగాది వేడుకలతో శ్రీకారం – North America Telugu Society

Published

on

Maryland: అమెరికా లో తెలుగు వారు ఎక్కడ ఉంటే తన పరిధిని విస్తరిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (North America Telugu Society – NATS) తాజాగా మేరీల్యాండ్‌లో తన విభాగాన్ని ప్రారంభించింది. అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలవడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న NATS తాజాగా Maryland లో కూడా విభాగాన్ని ఏర్పాటు చేయడంపై స్థానిక తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

NATS Maryland Chapter సమన్వయకర్తగా వకుల్ మోరే (Vakul More), నాట్స్ మేరీల్యాండ్ సంయుక్త సమన్వయకర్తగా విశ్వ మార్నిలకు బాధ్యతలు అప్పగించింది. అలాగే మేరీ ల్యాండ్ నాట్స్ మహిళా సాధికారత బాధ్యతలను హరిణి నార్ల (Harini Narla), సాంస్కృతిక కార్యక్రమాలను బాధ్యతలను సువర్ణ కొంగల్లలు నిర్వర్తించనున్నారు.  మేరీల్యాండ్‌లో తెలుగువారి సేవలు అమోఘం.

మేరీల్యాండ్‌ అభివృద్ధిలో తెలుగు వారు కృషి కూడా ఉందని సైక్స్‌విల్లే (Sykesville) మేయర్ స్టేసీ లింక్ (Stacy Link) అన్నారు. తెలుగు వారు సాంస్కృతిక ఐక్యతను పాటించడంలో ముందుంటారని ప్రశంసించారు. సమాజాన్ని కలిపి ఉంచడంలో సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని సైక్స్‌విల్లే డౌన్‌టౌన్ కనెక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ డీఈఐ ఆఫీసర్ జూలీ డెల్లా-మరియా అన్నారు.

తెలుగు సంప్రదాయాలను పాటించడమే మనం తెలుగువారమనే విషయాన్ని చాటి చెబుతుందని ప్రముఖ సర్జన్, విద్యావేత్త డాక్టర్ రామకృష్ణ భాగవతుల (Dr. Ramakrishna Bhagavatula) అన్నారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై ఆయన చేసిన ప్రసంగం అందరిని ఆకట్టుకుంది.

మేరీల్యాండ్ చాప్టర్ (Maryland Chapter) ప్రారంభోత్సవంలో ఉగాది వేడుకులను కూడా ఘనంగా నిర్వహించింది. తెలుగు సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద నృత్యాలు, కూచిపూడి నృత్యాలు తెలుగువారిని అలరించాయి. తెలుగుదనం ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.

మేరీల్యాండ్‌లో నాట్స్ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన నాట్స్ నాయకులకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) తన వీడియో సందేశం ద్వారా నాట్స్ నాయకులకు, మేరీల్యాండ్ విచ్చేసిన తెలుగు ప్రజలకు, ప్రజా ప్రతినిథులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మేరీల్యాండ్ నాట్స్ ప్రతిష్టను పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) మేరీల్యాండ్ నాట్స్ నాయకులకు సూచించారు.

నాట్స్ (North America Telugu Society – NATS) ప్రెసిడెంట్ మదన్ పాములపాటి నూతన చాప్టర్ సభ్యులను సభకు పరిచయం చేశారు. వారి వివరాలు: వకుల్ మోరే – ఛాప్టర్ కోఆర్డినేటర్, విశ్వ మర్ని జాయింట్ కోర్డినేటర్, హరిణి నార్ల  – ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్, సువర్ణ కొనగళ్ళ – కల్చరల్ చైర్.

భవిష్యత్తులో మేరీ ల్యాండ్ (NATS Maryland Chapter) చేపట్టే ప్రతి కార్యక్రమానికి నాట్స్ జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని North America Telugu Society (NATS) ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి(ఫిల్లీ), నాట్స్ ఉపాధ్యక్షులు హరి బుంగటావుల (ఫిల్లీ), శ్రీనివాస్ భీమినేని (న్యూజెర్సీ), నాట్స్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల (న్యూజెర్సీ), నాట్స్ మార్కెటింగ్ జాతీయ సమన్వయకర్త కిరణ్ మందాడి, మిడ్ ఈస్ట్ నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రావు దగ్గుబాటి (నార్త్ కరోలినా), నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్లు  వీరా తక్కెలపాటి (చికాగో), ఉమా నార్ని (నార్త్ కరోలినా) పాల్గొన్నారు.

ఇంకా వీరితో పాటు సికందర్ కోనపాక (Sikander Konapaka), సాగర్ రాపర్ల, రమేష్ నెల్లూరి, రమణ రకోతు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మేరీల్యాండ్ నాట్స్ విభాగ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారిని మేరీల్యాండ్ నాట్స్ టీం (Maryland NATS Team) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

error: NRI2NRI.COM copyright content is protected