Connect with us

News

వరద బాధితుల సమహాయార్దం AP CM Relief Fund కి 30 లక్షల విరాళం: North America Kamma Sangham

Published

on

ఎన్నడూలేని విధంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరదల ధాటికి కొన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విజయవాడ (Vijayawada), బుడమేరు, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలు వరద నీటి ఉగ్రతకు గురై గత వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.

అనేక సంస్థలు కూడా సహాయక చర్యల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అమెరికా లో ఉన్న NAKS (North America Kamma Sangham) సంస్థ వారు కూడా రాష్ట్ర ప్రజలకు తమ వంతు సహాయం అందించటం కోసం 30 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. దాతలు సహకారంతో సేకరించిన విరాళాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కి సీఎం వరద సహాయ నిధి కోసం చెక్ రూపంలో అందించారు.

ఈ సందర్భంగా NAKS ప్రతినిధులు మాట్లాడుతూ… ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా దేశం బయట ఉన్నప్పటికీ తమ మనసు ఎల్లప్పుడూ దేశ, రాష్ట్ర సమాజ హితం కోరుకుంటుందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ పరస్పర గౌరవం, సహాయ సహకారంతోనే సమాజం ముందుకు వెళ్లగలదని చెప్పారు. ఈ వరద (Floods) కష్టాల నుండి ప్రజలకు త్వరగా ఉపశమనం కలగాలని తాము భగవంతుడిని ప్రార్ధిస్తున్నామని అన్నారు.

విరాళాల సేకరణ లో సహకరించిన సభ్యులు శ్రీనివాస్ ఉయ్యూరు, సురేష్ చన్నమల్లు, అనిల్ చిమ్మిలి, ప్రుదీష్ మక్కపాటి, శివ మొవ్వ, భానుప్రకాష్ గుళ్లపల్లి, భూషణ్ పాలడుగు, సురేంద్ర పాలడుగు, కృష్ణ నాయుడు, కోటేశ్వరరావు కందిమళ్ల, స్వాతి పోలవరపు, వెంకట్ నర్రా, లక్ష్మీనారాయణ ఉన్నం, నరేష్ గొల్ల, లక్ష్మణ్ పర్వతనేని, అక్షర చేబ్రోలు, కిషోర్ తమ్మినేని, రంజిత్ కోమటి, వెంకట్ ప్రేమ్‌చంద్ తానికొండ మరియు దాతలకు NAKS (North America Kamma Sangham) సంస్థ తరపున ధన్యవాదాలు తెలియచేసారు.

error: NRI2NRI.COM copyright content is protected