Connect with us

Associations

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో అన్నమయ్య 610వ జయంతి మహోత్సవాలు

Published

on

ఏప్రిల్ 21న న్యూ జెర్సీలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 610వ జయంతి మహోత్సవాలు జరగనున్నాయి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగువారందరి మన్ననలు పొందుతున్న ఏకైక తెలుగు సంస్థ సిలికానాంధ్ర ఈ ఉత్సవాలు నిర్వహించనుంది. స్థానిక బ్రిడ్జివాటర్ లోని బాలాజీ గుడిలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేక ఉత్సవాలలో పలు కార్యక్రమాలు ఆహుతులను అలరించనున్నాయి. శ్రీ అన్నమాచార్యులవారి సంకీర్తనలతో వివిధ వయోవర్గాలవారికి న్యూ జెర్సీ ప్రాంతీయ స్థాయిలో సంగీత, నృత్య పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల నమోదుకు చివరి తారీఖు ఏప్రిల్ 18. ప్రాంతీయ పోటీలలో గెలిచిన వారు జాతీయ పోటీలలో పాల్గొనవచ్చు. డాక్టర్ పద్మ సుగవనం గారిచే కర్నాటిక్ సంగీత కచేరి, పేరొందిన స్వాతి అట్లూరి, ఇందిర శ్రీరామ్ రెడ్డి, దివ్య ఏలూరి మరియు సుధ దేవులపల్లి వారి కళాశాలల నుంచి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు వీనుల విందు చేయనున్నాయి. మరిన్ని వివరాలకు http://annamayya.siliconandhra.org/ లేదా శరత్ వేట (203-583-9537), పవన్ బొర్రా (201-317-8834), రజని సింగతి (732-397-2400), లక్ష్మి నండూరి (908-347-6134), గిరి కంభంమెట్టు (732-910-3966) లను సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected