తెలంగాణా సంస్క్రతికి ప్రతిబింబంగా, ప్రవాస తెలంగాణ ప్రజల వారధిగా వెలిసిన న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) అప్రతిహంగా తన కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్ననలు చూరగొంటూ విజయవంతంగా మూడవ సంవత్సరంలోకి అడుగిడింది.
డిసెంబర్ 2వ తేదీ శుక్రవారం, న్యూయార్క్ నగరం, హోటల్ రాడిసన్ వేదికగా జరిగిన 2వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ “దావత్” ధూమ్ ధాంగా జరిగిన కార్యక్రమంలో 2023 సంవత్సరానికి గాను New York Telangana Telugu Association సంస్థ తమ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.
సంస్థ శ్రేయోభిలాషులు శ్రీ పైళ్ల మల్లారెడ్డి గారు ఇతర ముఖ్య అతిథులతో పాటు NYTTA సంస్థ చైర్మన్ డా. రాజేందర్ రెడ్డి జిన్నా, ఉపచైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు గారు, కార్యదర్శి సతీష్ కల్వ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉషారెడ్డి మన్నెం, సహోదర్ పెద్దిరెడ్డి, పవన్ కుమార్ రవ్వ, మల్లిక్ రెడ్డి, డా. వేణుగోపాల్ పల్లా, డా. కృష్ణ బాధే మరియు రమ కుమారి వనమ పాల్గొన్న ఈ సభ విజయవంతంగా జరిగింది.
కార్యక్రమంలో NYTTA సంస్థ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ గూడూరు, సలహా సంఘ సభ్యులు ప్రదీప్ సామల, చినబాబు రెడ్డి మరియు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఉపచైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు గారు అతిథులను, హాజరైన సభ్యులను ఆహ్వానించి ఎన్నికైన వారిని సభకు పరిచయం చేసి ఆద్యంతo సభను ఉత్సాహభరితంగా నిర్వహించారు.
సభ్యుల హర్షాధ్వానాల మధ్య NYTTA సంస్థ చైర్మన్ డా. రాజేందర్ రెడ్డి జిన్నా 2023 సంవత్సరానికి గాను NYTTA సంస్థకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. శ్రీ సునీల్ రెడ్డి గడ్డం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా వాణి సింగిరికొండ, కార్యదర్శిగా గీత కనకాల, కోశాధికారిగా రవీందర్ కోడెల, ఉపసహాయ కార్యదర్శిగా హారిక జంగం మరియు ఉపసహాయ కోశాధికారిగా ప్రసన్న మధిర ఎన్నికయ్యారు.
అలాగే NYTTA సంస్థకు తమ సేవలందిస్తున్న కృష్ణా రెడ్డి తురుక, పద్మ తాడూరి, హరిచరణ్ బొబ్బిలి, సుదీర్ సువ్వ, నరోత్తం రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. అలాగే అలేఖ్య వింజమూరి మరియు ప్రవీణ్ కుమార్ చామ సమన్వయకర్తలుగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు సంఘాలు TLCA, TANA, NATS, NATA తో పాటు TTA సంస్థ ప్రతినిధులు హాజరై నూతన కార్యవర్గానికి తమ శుభాకాంక్షలు తెలియ జేశారు. అమెరికాలోని తెలుగు సంస్థలన్నీ పరస్పరం సహకరించుకుని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి తెలుగు వారి అభ్యున్నతికై కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గాయని సుందరి ములకలూరి పాటలతో అలరిoచింది. అలాగే NYTTA సంస్థ దివ్యాంగులైన గాయకులను ప్రోత్సహిచాలనే ఉద్దేశ్యంతో “ఆల్ ఇండియా టాలెంటెడ్ విశువల్లీ ఇంపేయిర్డ్ గ్రూప్” వారితో సంగీత కార్యక్రమం నిర్వహించింది. వారు ఆలపించిన గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆ సంస్థ ప్రతినిధి ఆర్ స్వామినాధన్ చైర్మన్, (అమృత నేత్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులైన గాయకులు విశాల్, కౌశిక్, స్వాతి భవాని తమ పాటలతో శ్రోతలను అలరిoచారు. అంకుష్, ఆదిమల్లు వాయిద్య సహకారం అందిచారు. లతా శ్రీనివాస్, కార్తీక్ సహకరించారు. ఈ సందర్భంగా విచ్చేసిన వారందరికీ NYTTA ధన్యవాదాలు తెలియజేసింది.