న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ అధ్యక్షతన, కార్యవర్గ సభ్యుల నేతృత్వంలో జూన్ 2వ తేదీన, Bethpage (New York) సీనియర్ కమ్యూనిటీ సెంటర్ లో తెలంగాణ (Telangana Formation Day) ఆవిర్భావ దశమ వార్షికోత్సవాలు సంబరాలు మరియు బాలోత్సవ వేడుకలు అత్యద్భుతంగా, చిన్నారుల ఆట పాటలతో, ఆనందోత్సవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వందేమాతరం శ్రీనివాస్ గారు, వారి తనయుడు తరంగ్ హాజరై కార్యక్రమాన్ని ఆధ్యంతం పాటలతో ఉర్రూతలుగించారు. కార్య క్రమంలో భాగంగా పద్మ కోడెల, హార్దిక జంగం మరియు ఇతరుల సహకారం తో ఏర్పరచిన ఆకృతులు తెలంగాణ (Telangana) సంస్కృతిని ప్రతిబింబించాయి. ముఖ్యంగా తెలంగాణ ఆమర వీరుల స్తూపం, తెలంగాణ తల్లి చిత్ర పాటం, బతుకమ్మ, బోనాలు, తెలంగాణ చిత్ర పటం, ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ చిత్ర పటం తెలంగాణ యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పాయి.
నైటా (NYTTA) సెక్రటరీ రవీందర్ కోడెల తెలంగాణ చరిత్ర పై చక్కటి స్వాగతోపన్యాసంతో మొదలై గణేశ ఆలాపనతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ శ్రీ జయ శంకర్ చిత్ర పటానికి జ్యోతి ప్రజ్వలన, పుష్పాలతో నివాళులు సమర్పించారు. అదేవిధంగా తెలంగాణ (Telangana) ఏర్పాటులో భాగంగా ఆత్మార్పణ చేసుకున్న అమరవీరులందరికి రెండు నిమిషాలు మౌనం పాటించి తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ ఆలపించూరు.
ఈ సందర్భంగా NYTTA (New York Telangana Telugu Association) Executive Committee మెంబర్ హేమ వెంకట మరియు కోశాధికారి హారి చరణ్ బొబ్బిలి స్థానిక చిన్నారులతో ఆట పాటలు కార్యక్రమన్ని సజావుగా నడిపారు. ముఖ్య అతిధి వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas) గారి వందేమాతరం, నీ పాదం మీది పుట్టుమచ్చనై , జై తెలంగాణ, ఎర్ర జెండా, ఎర్ర జెండా పాటలు మరియు తరంగ్ పాడిన పాటలు (Songs) మంచి జోష్ ని నింపాయి.
NYTTA చైర్మన్, Dr. రాజేందర్ రెడ్డి జిన్నా గారు, ప్రెసిడెంట్ వాణి గారు తెలంగాణ (Telangana) నేపాధ్యం గురించి వివరించడం జరిగింది. బాలోత్సవం సందర్భంగా ప్రేక్షకులను అలరించిన చిన్నారులకు వందేమాతరం శ్రీనివాస్, చైర్మన్ Dr. రాజేందర్ రెడ్డి జిన్నా, ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ చేతుల మీదుగా బహుమతులు మరియి సర్టిఫికేట్లు అందచేయటం జరిగింది.
కార్యక్రమానికి హాజరైనా అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గూడూరు గారు, మధుసుధన్ రెడ్డి గారు, చిన్నబాబు గారు, రమ కుమారి వనమ గారు సహాయ సహకారాలు అందజేశారు. చివరగా ప్రెసిడెంట్ వాణి (Vani Singirikonda) గారు వోట్ అఫ్ థాంక్స్ చెప్పుతూ ఈ కార్యక్రమానికి సహాకరించిన దాతలకు, చిన్నారులకు, కమిటీ మెంబెర్స్ మరియు వారి జీవిత భాగస్వాములందరికి కృతజ్ఞతలు తెలియచేటం జరింగింది.