Connect with us

News

హ్యాట్రిక్ విజయంతో ఇచ్ఛాపురం ఎమ్మెల్యేకి New York CMT Tennis Team అభినందనలు

Published

on

ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనసభ ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గం (Ichchapuram Assembly Constituency) నుంచి ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు డా. అశోక్ బెందాలం. తన సమీప వైసీపీ (YSR Congress Party) ప్రత్యర్థి విజయ పిరియా పై 39,783 ఓట్ల మెజారిటీతో 2024 ఎన్నికలలో గెలిచారు.

శ్రీకాకుళం (Srikakulam) లోక్ సభ పరిధిలో వరుసగా మూడు సార్లు శాసనసభ్యునిగా గెలిచి విజయవంతంగా హ్యాట్రిక్ కొట్టారంటూ అమెరికాలోని తన బ్రదర్ ఇన్ లా అశోక్ అత్తాడ (Ashok Attada) తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తరపున విజయఢంకా మోగించారన్నారు.

ఈ సందర్భంగా అశోక్ అత్తాడ మరియు స్నేహితుడు సుమంత్ రాంశెట్టి (Sumanth Ramsetti) సారధ్యంలో New York CMT Tennis Team తరపున ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డా. అశోక్ బెందాలం (Dr. Ashok Bendalam) కి విజయోత్సవ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected