న్యూ జెర్సీ, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కూటమి ప్రభుత్వ విజయంలో ఎన్నారైలు కీలక పాత్ర వహించారని గుడివాడ (Gudivada) ఎమ్మెల్యే రాము వెనిగండ్ల అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుడివాడ ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించిన రాము వెనిగండ్ల కి న్యూ జెర్సీ (New Jersey) లోని ఎన్నారైలు ఆత్మీయ అభినందన సభ శుక్రవారం నిర్వహించారు.
మోన్మౌత్ జంక్షన్ లోని ఎంబెర్ బాంకెట్స్ లో న్యూ జెర్సీ (New Jersey) కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఈ అభినందన సభలో సుమారు నాలుగు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన (Janasena), జై బీజేపీ (BJP) అంటూ పలువురు నినాదాలు చేశారు.
అనంతరం గుడివాడ ఎమ్మెల్యే రాము వెనిగండ్ల మాట్లాడుతూ.. ఎన్నారైలు గుడివాడ (Gudivada) ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించుటకు అనువుగా ఉంటుందని, ఏపీ (Andhra Pradesh) లో పెట్టుబడులు పెట్టి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తోందని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారైలు ఈ సారి ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ఎనలేని కృషి చేసారని కొనియాడారు. ఎన్నైరాల కృషి ఎంత చెప్పిన తక్కువ అని వారికి నా ప్రత్యేక అభినందనలు తెలపాలని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు (Nara Chandrababu Naidu) తెలిపారు అని రాము గారు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాధర్ గారపాటి (Vidyadhar Garapati), శ్రీహరి మందాడి (Srihari Mandadi), సమత కోగంటి, హరి ముత్యాల, రాధా నల్లమల్ల, జగదీశ్ యలమంచలి, రాజా కసుకుర్తి (Raja Kasukurthi) తదితరులు ఎన్నికల సంగ్రామంలో తమ అనుభవాలని పంచుకున్నారు.
ఈ ఆత్మీయ అభినందన సభలో తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu), తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షలు టి జి కె మూర్తి, సాయి కృష్ణ బొబ్బా, శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేకా, న్యూ జెర్సీ తెలుగుదేశం (New Jersey NRI TDP), జనసేన, భాజపా ప్రతినిధులు పాల్గొన్నారు.