ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా నగరంలో నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్ (Navya Andhra Telugu Association – NATA) ఆధ్వర్యంలో ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు.
ఆస్ట్రేలియా (Australia), భారతదేశం (India) మధ్య సంస్కృతి వారధిని పెంపొందించేలా నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్ ‘నాట’ ఆధ్వర్యంలో ఈ ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఇండియన్ హై కమిషన్ నుంచి ప్రతినిధులు, స్థానిక సెనేటర్ తదితర ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు.
సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వేదికను పండుగ వాతావరణంలో శోభాయమానంగా అలంకరించారు. ఆహ్వానితులందరూ ఉత్సాహంగా గడిపారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, పిల్లలు అందరూ సంప్రదాయ దుస్తులలో పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయ వంటకాలను అందరూ ఆస్వాదించారు.
Navya Andhra Telugu Association (NATA) అధ్యక్షులు సాహితి పాతూరి మాట్లాడుతూ.. ఈ ఉగాది & శ్రీరామనవమి వేడుకలు విజయవంతం కావడానికి సహాయం చేసిన నాట అసోసియేషన్ ప్రతినిధులు, స్పాన్సర్స్, వాలంటీర్స్, డాన్స్ స్కూల్స్ ఇలా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.