ప్రతి సంవత్సరం నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్ ‘నాట’ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా (Australia), భారతదేశం (India) మధ్య సంస్కృతి వారధిని పెంపొందించేలా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాము అని NATA ఫౌండర్ ప్రసాద్ తిపిర్నేని తెలిపారు.
ఈ సందర్బంగా మహిళలు అంతా పలు రకాల పొంగళ్లు వండి పండుగ విశేషాలను పంచుకున్నారు. పలు రకాల సంప్రదాయ ఆటల పోటీలను నిర్వహించారు. తాడు లాగుట, రంగోలి పోటీలు నిర్వహించి ఇండియన్ హై కమిషన్ కాన్సులర్ నరేంద్ర రానా చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.
చిన్నారుల కు బోగి పళ్ళు పోసి అశ్విరదించారు. గోబ్బెమ్మలు పేర్చి వాటి చుట్టూ మహిళలు నృత్యం ఆడి పాడి ఉత్సాహంగా గడిపారు. కుటంబ సభ్యులు, మిత్రులు, పిల్లలు అందరూ సంప్రదాయ దుస్తులలో పాల్గొని సంక్రాంతి పండుగను సరదాగా జరుపుకున్నారు.చివరలో తెలుగు సంప్రదాయ వంటకాలను అందరూ ఆస్వాదించారు.
ఈ సందర్బంగా Navya Andhra Telugu Association (NATA) ప్రెసిడెంట్ శ్రీమతి సాహితి పాతూరి మాట్లాడుతూ పండుగ ప్రాముఖ్యత తోపాటు రాబోయే తరాల వారికి మన సంస్కృతి, సంప్రదాయాల ఆవశ్యకతను తెలియజేయడం, వాటి గొప్పతనాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అన్నారు. ఈ సంబురాలలో నాట అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.