Connect with us

Business

ఫ్రాంచైజ్ బిజినెస్‌పై NATS వెబినార్, ఔత్సాహికులకు దిశా నిర్థేశం 

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS) అమెరికా లో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతు తాజాగా ప్రాంచైజ్ బిజినెస్ పై ఆన్‌లైన్ వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉండే తెలుగువారి ఆర్థిక భద్రతకు, స్వశక్తితో ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని అందించే విధంగా నాట్స్ ఈ వెబినార్‌కు శ్రీకారం చుట్టింది. 250 మందికి పైగా తెలుగువారుపాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ (New Jersey) లో ప్రముఖ వ్యాపారవేత్త, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ టి.పి.రావు ఈ వెబినార్‌లో ప్రాంచైజీ బిజినెస్‌ పై అవగాహన కల్పించారు.

తక్కువ పెట్టుబడితో స్థిరమైన వ్యాపారం (Business) ప్రాంచైజెస్‌ల వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. మార్కెట్ పై అవగాహన పెంచుకోవడం, సరైన ప్రాంతాలను, ప్రాంచెజ్ పెట్టే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడంలోనే సగం విజయం దాగుందని టి.పి.రావు వివరించారు. మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ప్రాంచైజ్‌స్‌లతో రిస్క్ తక్కువగా ఉంటుందని, కానీ ప్రాంచైజ్ ప్రారంభించిన తొలినాళ్లలో దాని నిర్వహణ, వ్యవస్థాగతంగా దాన్ని బలోపేతం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి నిలిపితే చక్కటి లాభాలు ఉంటాయని తెలిపారు.

ప్రాంచైజ్‌స్ పై అవగాహన కల్పించడంతో పాటు ప్రాంచైజస్ ఏర్పాటు తన వంతుగా చేతనైన సహకారం అందిస్తానని టి.పి. రావు వెబినార్‌లో పాల్గొన్న వారికి హామీ ఇచ్చారు. సమయం, ధనం వెచ్చించి పట్టుదలతో ముందుకు వచ్చే ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రాంచైజస్ చక్కటి మార్గమని తెలిపారు. ఈ వెబినార్‌కు నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి అనుసంధానకర్తగా వ్యవహరించారు. చాలా మంది ఔత్సాహికులు ప్రాంచైజ్ నిర్వహణ, ప్రాంచైజస్ బిజినెస్‌ (Franchise Business) లో వచ్చే ఇబ్బందుల గురించి తమ సందేహాలను టి.పి.రావు ని అడిగి నివృత్తి చేసుకున్నారు.

ప్రస్తుత యూఎస్ గవర్నమెంట్లో ఉద్యోగాల, ఉద్యోగుల డోలాయమాన పరిస్థితుల్లో ఇటువంటి వెబినార్స్ యువతకు ఎంతో సహాయకారకం గా ఉంటాయని నాట్స్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, బోర్డ్ డైరెక్టర్ చెబుతూ టి.పి.రావును అభినందించారు. ఆన్‌లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందు టి.పి.రావు,కిరణ్ మందాడిలను నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేకంగా అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected