Connect with us

Sports

గాంధీ జయంతి సందర్భంగా 32 జట్లతో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ @ Dallas

Published

on

డల్లాస్, అక్టోబర్ 10, 2023: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా డల్లాస్‌లో వాలీబాల్ టోర్నమెంట్ (Volleyball Tournament) నిర్వహించింది. ప్రతి యేటా గాంధీ జయంతి (Gandhi Jayanti) ని పురస్కరించుకుని నాట్స్ వాలీబాల్‌ టోర్నమెంట్లు నిర్వహిస్తూ వస్తోంది.

ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కి మంచి స్పందన లభించింది. డల్లాస్‌ (Dallas) లోని లూయిస్‌వెల్లి, మ్యాక్ స్పోర్ట్స్ నందు జరిగిన ఈ టోర్నమెంట్లకు మంచి స్పందన లభించింది. డల్లాస్ చుట్టుపక్కల వివిధ నగరాల నుండి వచ్చిన 250 మందికి పైగా వాలీబాల్ ప్లేయర్లు (Volleyball Players) ఈ టోర్నమెంట్స్‌ లో పాల్గొన్నారు.

నాట్స్ ప్రో కప్, నాట్స్ అడ్వాన్స్డ్ కప్ పేర్లతో జరిగిన టోర్నమెంట్లలో 32 జట్లు పోటీపడ్డాయి. ఆద్యంతం ఆసక్తిగా జరిగిన ఈ టోర్నమెంట్లలో నాట్స్ ప్రో కప్ విజేతగా ఇండీ రూట్స్ బ్లాక్ టీం, రన్నర్-అప్ గా వాలీ వూల్వ్స్ టీం నిలిచాయి. నాట్స్ (NATS) అడ్వాన్స్డ్ కప్ విజేతగా టీం జీపీఎస్, రన్నర్-అప్ గా సెలీనా స్ట్రైకర్స్ నిలిచాయి.

ఈ టోర్నమెంట్స్‌ని విజయవంతంగా నిర్విహించిన నాట్స్ డల్లాస్ (Dallas) స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గౌతమ్ కాసిరెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు విజయ్ బల్లా, శివ నాగిరెడ్డి, పార్థ బొత్స, రవీంద్ర చిట్టూరి, శ్రీధర్ న్యాలమడుగుల, రవీంద్ర చుండూరు, మురళి కొండేపాటి, హర్ష పిండి, వరిశ్, త్రినాథ్, నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్ సత్య శ్రీరామనేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ డీవీ ప్రసాద్ లను ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు, కమ్యూనిటీ సభ్యులు అభినందించారు.

ఇంకా ఈ టోర్నమెంట్లో నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రాజేంద్ర మాదాల పాల్గొని, క్రీడాకారులను ప్రోత్సహించారు. నాట్స్ (North America Telugu Society) చైర్ విమెన్ అరుణ గంటి కూడా వాలీబాల్ టోర్నమెంట్స్ దిగ్విజయంగా నిర్వహిచినందుకు డల్లాస్ చాప్టర్ సభ్యులకు అభినందనలు తెలిపారు.

అలాగే తెలుగువారి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, క్రీడా (Sports) స్ఫూర్తిని పెంపొందించే విధంగా గత 13 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్న డల్లాస్ (NATS Dallas Chapter) కార్యవర్గ సభ్యులకు క్రీడాకారులు అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected