Connect with us

Sports

గాంధీ జయంతి సందర్భంగా 200 మందితో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ @ Dallas, Texas

Published

on

Dallas, Texas: అమెరికాలో తెలుగు వారిని ఒక్కటి చేసే విధంగా నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నాట్స్ డల్లాస్ విభాగం (NATS Dallas Chapter) గాంధీ జయంతి పురస్కరించుకుని వాలీబాల్ టోర్నమెంట్ (Volleyball Tournament) నిర్వహించింది. డల్లాస్‌లో నాట్స్ నిర్వహించిన ఈ 16వ వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. దసరా పండుగ రోజు దాదాపు 200 మంది వాలీబాల్ ప్లేయర్స్ ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్ని క్రీడా స్ఫూర్తిని చాటారు.

డల్లాస్ (Dallas) చాప్టర్ క్రీడా కోఆర్డినేటర్లు గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా తమ అనుభవాన్ని, ప్రతిభని రంగరించి ప్రణాళిక నుండి కార్యాచరణ వరకు టోర్నమెంట్‌ని దిగ్విజయం చేశారు. నాట్స్ (NATS) మాజీ అధ్యక్షులు బాపు నూతి (Bapu Nuthi), నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల (Rajendra Madala) అందించిన మద్దతు, దిశానిర్దేశం వల్ల తమ మొదటి కార్యక్రమం ఇంత విజయవంతం అయిందని నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్ స్వప్న కాట్రగడ్డ తెలిపారు.

అందరి ఉత్సాహం మరియు క్రీడా స్ఫూర్తి వల్ల నాట్స్ డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) సభ్యులకు ఈ టోర్నమెంట్ మరిచిపోలేని అనుభవంగా మిగిలిందని, మరిన్ని మంచి కార్యక్రమాలు చేయటానికి ప్రోత్సాహం ఇచ్చిందని నాట్స్ (North America Telugu Society) డల్లాస్ చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ శ్రావణ్ నిడిగంటి అన్నారు.

నాట్స్ డల్లాస్ 16వ వాలీబాల్ టోర్నమెంట్లో (Volleyball Tournament) పాల్గొన్న క్రీడాకారులను, సహకరించిన వాలంటీర్స్, వారిని ప్రోత్సహించడానికి వచ్చిన వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు డల్లాస్ చాప్టర్ టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్లో తలపడిన జట్లని రెండు విభాగాలుగా విభజించారు. ప్రో కేటగిరీ విభాగంలో విజేతలుగా వాలీ వోల్ఫ్స్ జట్టు, రన్నర్స్ గా వజ్రాస్ జట్టు నిలిచాయి.

అలానే అడ్వాన్స్డ్ విభాగంలో విజేతలుగా వికింగ్స్ జట్టు నిలవగా, రన్నర్స్ గా వాలీ డూడ్స్ జట్టు నిలిచింది. విజేతలకు, రన్నర్స్ కు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న నాట్స్ నాయకులు (NATS Leaders) బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాట్స్ మాజీ అధ్యక్షులు బాపు నూతి,నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల లు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న విద్యార్థులు, యువతతో కూడిన జట్టులను ప్రత్యేకంగా అభినందించారు.

అలాగే పెద్దవారితో పోటీపడి అత్యంత ప్రతిభని ప్రదర్శించిన 8వ తరగతి విద్యార్థి కార్తీక్ కు ప్రత్యేక గుర్తింపునిస్తూ గిఫ్ట్ కార్డుని బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ టోర్నమెంటు నిర్వహణలో నాట్స్ డల్లాస్ చాప్టర్ (NATS Dallas Chapter) టీం నుండి గౌతమ్ కాశిరెడ్డి, విజయ్ బల్లా, స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటి లతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు రవి తాండ్ర మరియు కిషోర్ నారెలు, డల్లాస్ చాప్టర్ సభ్యులు శ్రీధర్ విన్నమూరి, పవన్ కొతారు, త్రినాథ్ పెద్ది, వంశీ వేణాటి, కావ్య, బద్రి బియ్యపు,ఇతర సభ్యులు తమ వంతు సహకారాన్ని అందించారు.

ఇదే విధంగా భవిష్యత్తులో మరెన్నో సాంసృతిక మరియు క్రీడా కార్యక్రమాలను చేపట్టబోతున్నామని డల్లాస్ చాప్టర్ టీం తెలిపింది. ఈ టోర్నమెంట్ (Volleyball Tournament) కు సహకరించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, వేల్యూ ఫైనాన్సియల్ సర్వీసెస్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమి, హింద్ సైట్, కోపెల్ చెస్ క్లబ్, మరియు ఫార్మ్2కుక్ లకు డల్లాస్ చాప్టర్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) డల్లాస్ టీంకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

error: NRI2NRI.COM copyright content is protected