Connect with us

Sports

నాట్స్ సంబరాల క్రమంలో Volleyball & Throwball టోర్నమెంట్ల నిర్వహణ @ Tampa, Florida

Published

on

Tampa, Florida: ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ (NATS) అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్ (Volleyball), త్రోబాల్ (Throwball) టోర్నమెంట్లను టాంపాలో North America Telugu Society (NATS) నిర్వహించింది.

మొత్తం 12 వాలీబాల్ (Volleyball) జట్లు, 5 మహిళా త్రోబాల్ (Throwball) జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది.

మహిళల త్రోబాల్ (Throwball) టోర్నమెంట్‌లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ (Volleyball) టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. 

నాట్స్ (NATS) కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి (Ranjit Palempati) అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది (Srinivas Malladi) తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్‌లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు.

నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు.

జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టాంపా (Tampa, Florida) లో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది.

నాట్స్ (North America Telugu Society – NATS) అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati), ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టాంపా (Tampa, Florida) తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

error: NRI2NRI.COM copyright content is protected