అమెరికాలో తెలుగువారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సాహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నాట్స్ (North America Telugu Society) అమెరికాలో తెలుగమ్మాయి అనే కార్యక్రమాన్ని నిర్వహించింది.
న్యూజెర్సీ వేదికగా జరిగిన తెలుగమ్మాయి పోటీలకు మంచి స్పందన లభించింది. ఎంతో మంది అమ్మాయిలు ఈ పోటీల్లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కేవలం అందమే కాకుండా, ప్రతిభ, తెలుగు భాషపై ఉన్న పట్టు, సామాజిక సేవ, ఆత్మీయ అనుబంధాలు ఇలా పలు విభాగాలుగా పోటీదారులను పరీక్షించి అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని నాట్స్ విజేతలుగా ప్రకటించింది.
న్యూజెర్సీ (New Jersey) పరిధిలో నాట్స్ అమెరికా తెలుగుమ్మాయిగా ప్రథమ స్థానాన్ని శృతి యర్రగుంట్ల కైవసం చేసుకుంది. ద్వితీయ స్థానాన్ని సాయి శ్రీ వల్ల వింజమూరి, తృతీయ స్థానాన్ని మౌక్తిక చక్కిలం సొంతం చేసుకున్నారు. నాట్స్ అమెరికా తెలుగమ్మాయి కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తోంది.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఈ తెలుగమ్మాయి పోటీలు జరగనున్నాయి. ప్రతి రాష్ట్రంలో తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్న వారు న్యూజెర్సీ వేదికగా మేలో జరగనున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో జరిగే నాట్స్ అమెరికా తెలుగమ్మాయి ఫైనల్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.
న్యూజెర్సీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు తెలుగమ్మాయిలను నాట్స్ సత్కరించింది. నాట్స్ అమెరికా తెలుగమ్మాయి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాట్స్ ఛైర్ ఉమన్ అరుణ గంటి (Aruna Ganti) విశేష కృషి చేశారు. అరుణ గంటి నాయకత్వంలో తెలుగమ్మాయి కారక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా కవిత తోటకూర తన టీం లోని సీత అయ్యల, శ్రీదేవి జాగర్లమూడి, బిందు యలమంచిలి, ఉమా మాకం, స్వర్ణ గడియారం, శ్రీదేవి పులిపాక, గాయత్రి చిట్టేటి, లావణ్య తొడుపునూరి, ప్రణీత పిడిగిమర్రి, సమత కోగంటి, శ్రీనివాస్ తోడుపునూరి, రమణ యలమంచిలి, ఫణి మోహన్ తోటకూర, సురేష్ మాకం, నాగేశ్వర్ ఐత, వెంకట్ జాగర్లమూడి, బసవ శేఖర్ శంషాబాద్, రాశి శంషాబాద్ తదితరులు తమ సహకారం అందించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి (Bapu Nuthi)ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు అమ్మాయి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ ఒక్కరినీ సంబరాలు.ఆర్గ్ లో రిజిస్టర్ చేసుకుని సంబరాలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
నాట్స్ (NATS) 7 వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని తో పాటు బోర్డ్ గౌరవ సభ్యులు, బోర్డ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించడంలో సహకరించిన ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు.