Connect with us

Kids

ఫ్లోరిడా హోప్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ హోమ్‌ అనాధలకు నాట్స్ టాయ్ డ్రైవ్‌: Tampa Bay, Florida

Published

on

అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మరో వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. ఫ్లోరిడాలోని టాంప బే లో ఏప్రిల్ 29న నాట్స్ ఈస్టర్ దుస్తుల విరాళం నిర్వహించింది. టంపాలోని హోప్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ హోమ్‌లో అనాథ చిన్నారులకు దుస్తులు విరాళంగా ఇచ్చేందుకు చేపట్టిన ఈ ఈస్టర్ దుస్తులు విరాళం విజయవంతంగా జరిగింది.

నాట్స్ సభ్యులు, తెలుగువారు చాలా మంది బొమ్మలను విరాళంగా ఇచ్చారు. ఇలా నాట్స్ సేకరించిన దుస్తులు హోప్ చిల్డ్రన్ హోమ్‌కి విరాళంగా అందించడం జరిగింది. నాట్స్ చేపట్టిన ఈ ఈస్టర్ దుస్తులు విరాళం కార్యక్రమం పట్ల హోప్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. నాట్స్ సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రశంసల వర్షం కురిపించింది. నాట్స్ సభ్యులతో పాటు వారి పిల్లలు కూడా ఇందులో భాగస్వాములై ఈస్టర్ దుస్తులు విరాళ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

చిన్నారుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే భావన పెంచడానికి ఈ ఈస్టర్ దుస్తులు విరాళం ఎంతగానో దోహద పడుతుందని హోప్ సంస్థ అభిప్రాయపడింది. నాట్స్ చేపట్టిన ఈస్టర్ దుస్తులు విరాళం విజయవంతం చేయడానికి ప్రశాంత్ పిన్నమనేని, రాజేష్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, విజయ్ కట్టా, భార్గవ మాధవరెడ్డి తదితరులు కీలక పాత్ర పోషించారు.

ఈ టాయ్ డ్రైవ్ కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా.కొత్త శేఖరం, బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు ఆఫ్ డైరక్టర్ శ్రీనివాస్ మల్లాది తదితరులకు నాట్స్ టాంప బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఫైనాన్స్/మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహ మండలి సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కో ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కోఆర్డినేటర్ విజయ్ కట్టా, కోఆర్డినేటర్ కమిటీ చైర్స్ భరత్ ముద్దన, హరి మండవతో పాటు నాట్స్ వాలంటీర్‌లందరూ చక్కటి ప్రణాళికతో టాయ్ డ్రైవ్‌ని విజయవంతం చేశారు.

భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు టాయ్ డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టాంప బే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం టాయ్ డ్రైవ్‌ నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టాంప బే నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన, సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళీ కృష్ణ మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected