అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అనాధ చిన్నారుల కోసం ఫుడ్ అండ్ టాయ్స్ డోనేషన్ డ్రైవ్ (Food and Toys Donation Drive) నిర్వహించింది. ఫ్లోరిడా (Florida) లోని టాంపా బే లో నాట్స్ విభాగం నిర్వహించిన ఈ డోనేషన్ డ్రైవ్‌లో సేకరించిన ఆహారాన్ని, బొమ్మలను టాంపా బే లోని ఫీడ్ అవర్ చిల్డ్రన్ హోమ్‌లోని అనాథ చిన్నారులకు విరాళంగా అందించింది.
నాట్స్ (NATS) సభ్యులు, తెలుగువారు చాలా మంది బొమ్మలను, ఆహారాన్ని విరాళంగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. నాట్స్ చేపట్టిన ఈ డోనేషన్ డ్రైవ్ పట్ల ఫీడ్అవర్ చిల్డ్రన్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. నాట్స్ సేవాభావంతో చేపట్టిన ఈ కార్యక్రమం చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. నాట్స్ సేవా భావంతో చేపట్టిన ఈ కార్యక్రమం సమాజంలో స్ఫూర్తిని నింపుతుందని నాట్స్ పై ప్రశంసల వర్షం కుపించింది.
చిన్నారుల్లో సృజనాత్మకత పెంచే పజిల్స్, బొమ్మలు, రిమోట్ కార్లు, సాప్ట్ టాయ్స్ ఇలా ఎన్నో రకాల బొమ్మలు టాయ్ డ్రైవ్‌లో నాట్స్ సేకరించడం ఇవ్వడాన్ని ఫీడ్ అవర్ చిల్డ్రన్ సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి, సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే భావన పెంచడానికి ఈ డ్రైవ్ ఎంతగానో దోహద పడుతుందని ఫీడ్ అవర్ చిల్డ్రన్ సంస్థ (Feed Our Children Ministries) అభిప్రాయపడింది.
పండుగ సమయంలో అందరూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డోనేషన్ డ్రైవ్ చేపట్టిందని నాట్స్ తెలిపింది. టాంపా బే నాట్స్ విభాగం (NATS Tampa Bay Chapter) సభ్యులు, తెలుగు వారు కుటుంబసమేతంగా చిన్నారులతో సహా ఈ ఈ డోనేషన్ డ్రైవ్‌లో పాల్గొని విజయవంతం చేశారు. రామ కామిశెట్టి, రాజేష్ కాండ్రు, సురేష్ బొజ్జా, భాను ధూళిపాళ్ల, భాస్కర్ సోమంచి తదితరులు ఈ డోనేషన్ డ్రైవ్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, నవీన్ మేడికొండ, భార్గవ్ మాధవరెడ్డి, ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ డ్రైవ్ చక్కగా సాగడానికి తమ వంతు సహకారం అందించారు.
భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ (NATS Tampa Bay Chapter) విభాగాన్ని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, నాట్స్ కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.