Connect with us

Cricket

స్ఫూర్తి నింపుతున్న భారత అంధ క్రికెటర్లకు నాట్స్ మద్దతు @ Chicago

Published

on

Chicago, Illinois: అమెరికాలో పర్యటిస్తున్న భారత అంధ క్రికెటర్లకు అనూహ్య మద్దతు లభిస్తుంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తోపాటు పలు తెలుగు, ఇతర భారతీయ స్వచ్చంధ సంస్థలు భారత అంధ క్రికెటర్లకు తమ హర్థిక, ఆర్ధిక మద్దతు అందిస్తున్నాయి. అంధ క్రికెటర్లు అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని అభినందనలు తెలిపారు.

బెంగళూరు (Bangalore) కి చెందిన సమర్ధనం ట్రస్ట్, క్యాబి ఆధ్వర్యంలో భారత అంధ క్రికెటర్లు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించటం, 2028 పారా ఒలింపిక్స్ లో భారత అంధుల క్రికెట్ జట్టు (Indian Blind Cricket Team) ప్రాతినిధ్యానికి ఆర్ధిక వనరులు చేకూర్చటం వీరి అమెరికా (USA) పర్యటన ముఖ్య ఉద్దేశం.

ఈ సందర్భంగా చికాగో (Chicago) లో నాట్స్‌తో పాటు నాట్స్ (NATS) సోదర సంస్థలు భారత అంధ క్రికెటర్లను తమ మద్దతు ప్రకటించడంతో పాటు వారి కోసం విందు,పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యులను మెంటార్ ధీరజ్ అంధుల క్రికెట్‌లో మూడు కేటగిరిలను, వాటి విభజనను నాట్స్ సభ్యులకు వివరించారు. ఈ మూడు గ్రూపుల ఆధారంగానే క్రికెట్ టౌర్నమెంట్స్ (Cricket Tournaments) నిర్వహిస్తామని తెలిపారు.

ఈ అంధుల క్రికెట్ జట్టులో తెలుగు (Telugu) మరియు గుజరాతీ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటం పట్ల నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. అంధత్వాన్ని అధిగమించి ఆటను జయించిన ఈ ఆటగాళ్ళని చూసి అందరం స్ఫూర్తి పొందాలని నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) పిలుపునిచ్చారు. అంధ క్రికెటర్లకు నాట్స్ అండదండలు ఎల్లపుడూ ఉంటాయని, వారు ఆడే మ్యాచ్ లకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ (North America Telugu Society) అధ్యక్షులు మదన్ పాములపాటి తోపాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్.కె బాలినేని, శ్రీ హరీష్ జమ్ముల, ఇమ్మానుయేల్ నీల, చికాగో చాప్టర్ టీం నుండి వీర తక్కెళ్లపాటి, శ్రీనివాస్ ఎక్కుర్తి, చెన్నయ్య కంబాల, సిరి బచ్చు భారతి పుట్ట, గోపి ఉలవ, కిరణ్, ప్రదీప్, సతీష్ త్రిపురనేని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected