ఎడిసన్, న్యూ జెర్సీ, నవంబర్ 4: అమెరికాలో సేవా కార్యక్రమాలతో అందరికి చేరువ అవుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా నమీ (National Alliance on Mental Illness) వాక్స్‌కు మద్దతు ఇచ్చింది.
మానసిక ఆరోగ్యం సరిగా లేని వారి కోసం అమెరికాలో సేవలు అందిస్తున్న నేషనల్ అలయన్స్ ఆన్ మెంటల్ ఇల్‌నెస్ (NAMI) న్యూజెర్సీ విభాగం నిధుల సేకరణ కోసం నమీ వాక్స్ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి నాట్స్ (North America Telugu Society) తన సంపూర్ణ మద్దతు అందించింది. ప్రతి సంవత్సరం అమెరికా వ్యాప్తంగా నమీ వాక్స్ నిర్వహిస్తారు.
ఇటీవల కాలంలో మానసిక ఆరోగ్య సమస్యలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ (COVID-19) తర్వాత ఈ సమస్యలు అన్ని వయసుల వారిలో మరింత పెరుగుతున్నాయి. మానసిక ఆరోగ్యం ఏ జాతి, మతం లేదా సామాజిక స్థితిని వివక్ష చూపదని నమీ వాక్స్ నిర్వాహకురాలు శుభ అన్నారు.
దక్షిణాసియా (South Asia) యువతకు మానసిక చికిత్సలు చాలా అవసరమని పేర్కొన్నారు. ఆసియా యువతలో 75% మంది 24 ఏళ్ల వయస్సులో మానసికంగా ప్రభావితమవుతుండగా, 50% మంది 14 నుంచి19 ఏళ్లలోపు మానసికంగా ప్రభావితం కావడం ఆశ్చర్యకరమైన విషయమని నమీ సంస్థ తెలిపింది.
నమీ (National Alliance on Mental Illness) కి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉందని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti) అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక యువజన నాయకులు, పెద్దలు నమీకి మద్దతు తెలిపారు. నమీ వాక్స్ ద్వారా మొత్తం 78 వేల డాలర్లు విరాళంగా సేకరించారు.
ఈ కార్యక్రమంలో బిందు యలమంచిలి, రమణ యలమంచిలి, రాజ్ అల్లాడ, శ్రీహరి మందడి, శ్యామ్ నాళం, గంగాధర్ దేసు, అరుణ గంటి, గోపి కృష్ణ గుర్రం తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. నమీకి మద్దతు ఇచ్చేందుకు ముందు కొచ్చిన నాట్స్ (NATS) సభ్యులను, నాయకులకు నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.