Nidadavolu, May 28, 2024: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఇటు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే నిడదవోలు (Nidadavolu) మండలం రావిమెట్లలో హృదయాలయం మానసిక దివ్యాంగుల పాఠశాలకు నాట్స్ తన వంతు చేయూత అందిస్తోంది.
ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి ఈ East Godavari లోని పాఠశాలను సందర్శించారు. మానసిక దివ్యాంగుల చదువుకు వినియోగించే మెటీరియల్ కోసం 50 వేల రూపాయలను నాట్స్ (North America Telugu Society) అందించింది.
హోప్ ఫర్ స్పందన (Hope4Spandana) సహకారంతో గత కొంత కాలంగా నాట్స్ మానసిక దివ్యాంగులకు చేయూత అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. సమాజంలో మానసిక దివ్యాంగులకు మానవత్వంతో ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత ఉందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు.
నాట్స్ (North America Telugu Society) మానసిక దివ్యాంగులకు అండగా నిలిచేందుకు తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. దివ్యాంగుల కోసం నాట్స్‌తో కలిసి పనిచేస్తున్న హోఫ్ ఫర్ స్పందనకు నాట్స్ బోర్డ్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.