Connect with us

Education

మెరిట్ విద్యార్థులకు బాసటగా ‘నాట్స్’ ఉపకార వేతనాలు: Bapu Nuthi

Published

on

కన్న తల్లి లాంటి జన్మభూమి కోసం నేనేం చేశాను అని ఆలోచించే వ్యక్తులే దేశానికి మేలు చేస్తారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అధ్యక్షులు కూడా అదే చేశారు. తన జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి ముందుడుగు వేశారు. తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో ప్రతిభగల పేద విద్యార్ధులకు అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు.

తాను చదువుకున్న కళాశాలలో ప్రస్తుతం అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించారు. పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్ధుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు నర్రా బాలకృష్ణ, నూతి సుబ్బారావు, తుమ్మల నాగేశ్వరమ్మ, దాసరి రమేష్, కాకుమాను నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ జి.వీర రాఘవయ్య, యన్ సి సి అధికారి డా॥ పి.శ్రీనివాస్ రావు, ఆఫీస్ ఇంచార్జ్ డి. లక్ష్మి నారాయణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీవిద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ ఉపకార వేతనాల (Scholarships) కార్యక్రమాన్ని నిర్వహించటం పట్ల కళాశాల పాలక వర్గ అధ్యక్షులు శ్రీ కాళహస్తి సత్యనారాయణ, సెక్రటరీ & కరస్పాండెంట్ డా॥ లావు రత్తయ్య, కళాశాల ట్రెజరర్ శ్రీ లావు ఆదిశేషయ్య కళాశాల తరపున బాపయ్య చౌదరి నూతికి అభినందనలు తెలిపారు.

కళాశాల పూర్వ విద్యార్థి బాపయ్య చౌదరి నాట్స్ (North America Telugu Society) అధ్యక్షునిగా ఎన్నికై తాను చదువుకున్న కళాశాలలోనే పేద విద్యార్థులకు సహాయసహకారాలు అందించడం మరెందరో పూర్వ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అని అభినందించారు.

NATS మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్ధులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిభ గల విద్యార్ధులను మెరిట్ స్కాలర్‌షిప్‌లతో ప్రోత్సాహిస్తున్న నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected