Connect with us

Health

నాట్స్ & సాయి దత్త పీఠం: ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్

Published

on

తెలుగువారి కోసం అమెరికాలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ‘నాట్స్’ న్యూజెర్సీలో సాయి దత్త పీఠంతో కలిసి నవంబర్ 21న ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది. దాదాపు 250 మందికి పైగా తెలుగువారు పిల్లలతో సహా ఈ డ్రైవ్‌లో వ్యాక్సిన్లు వేయించుకున్నారు. శ్రీ శివ, విష్ణు దేవస్థానం కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమానికి న్యూజెర్సీలోని వుడ్లేన్ ఫార్మసీ (ఓల్డ్ బ్రిడ్జి), తెలుగు కళా సమితి తమ వంతు సహకారం అందించాయి.

ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోస్ కూడా ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ లో ఇచ్చారు. అమెరికాలో తెలుగుజాతి కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు నాట్స్ ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, వెంకట్ మంత్రిప్రగడ, పలువురు బోర్డు సభ్యులు, స్టాఫ్ వాలంటీర్ల సహకారంతో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు.

న్యూజెర్సీ పబ్లిక్ యూటీలిటీ కమిటీ ఉపేంద్ర చివుకుల ఇందుకు తన పూర్తి సహకారాన్ని అందించారు. ఎంతో ఓపికగా వ్యాక్సిన్లు వేసిన ఫార్మసిస్ట్ రవి కి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. స్థానిక వైద్యులు సూర్యం గంటి, విజయనిమ్మ, భవాని జీ రెడ్డి, వరలక్ష్మి అన్నదానం లు తమ విలువైన సమయాన్ని ఈ ఉచిత వాక్సిన్ శిబిరం కోసం వెచ్చించారు.

న్యూజెర్సీ నాట్స్ విభాగం నాయకులు అరుణ గంటి, మోహన కృష్ణ మన్నవ, రాజ్ అల్లాడ, రంజిత్ చాగంటి, మురళీ కృష్ణ మేడిచర్ల, సుధీర్ మిక్కిలినేని, రవి గుమ్మడిపూడి, శ్యాం నాళం, రమేశ్ నూతలపాటి, వంశీ కృష్ణ వెనిగళ్ల, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, సురేష్ బొల్లు, మోహన్ కుమార్ వెనిగళ్ల, గిరి కంభంమెట్టు, కిరణ్ కుమార్ తవ్వ , విజయ్ బండారు, హర్ష చదలవాడ, అభి బొల్లు, అజయ్, అంజు తదితరులు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతానికి తమ వంతు కృషి చేశారు.

నాట్స్ చేపట్టిన ఈ ఉచిత వాక్సిన్ శిబిర నిర్వహణకు సాయి దత్త పీఠం
శ్రీ శివ విష్ణు ఆలయం న్యూ జెర్సీ నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, సాయిదత్త పీఠం కమ్యూనిటీ హాల్ లో శిబిరం ఏర్పాటుకు సహకరించడంతో పాటు శిబిరానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా సాయి దత్త పీఠం ఏర్పాటు చేసింది.

సాయి దత్త పీఠం ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యులు వెంకట్ మంత్రిప్రగడ, మురళీ కృష్ణ మేడిచెర్ల తమవంతు సహకారం అందించారు. మధు అన్నా కూడా విచ్చేసారు. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కు సహకరించిన వుడ్ లేన్ ఫార్మసీ నిర్వాహకులను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది. దీంతో పాటు స్థానిక తెలుగు కళాసమితి నాయకులు శ్రీ దేవి జాగర్లమూడి, బిందు ఎలమంచిలి, రవి అన్నదానం, రంగా తదితరులు ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌లో అందించిన మద్దతుకు కూడా నాట్స్ బోర్డు చైర్మన్ శ్రీధర్ అప్పసాని , ప్రెసిడెంట్ శేఖర్ అన్నే ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected