Connect with us

Sports

37 జట్లతో New Jersey లో దిగ్విజయంగా నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్

Published

on

అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ న్యూజెర్సీ (New Jersey) లో పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్ లో 37 టీమ్స్ పోటీ పడ్డాయి. దాదాపు 1000 మంది ఆటగాళ్ళు ఇందులో తమ ఆట తీరు చూపెట్టేందుకు పోటీపడ్డారు.

నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi) చొరవతో న్యూజెర్సీ టీం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌కు అటు ఆటగాళ్ల నుంచి ఇటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నాట్స్ న్యూజెర్సీ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ సురేంద్ర పోలేపల్లి ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

అలాగే నాట్స్ (NATS) కోఆర్డినేషన్ టీం నుంచి ప్రసాద్ టేకి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ ఇమ్మిగ్రేషన్ అధ్యక్షులు రాకేశ్ వేలూరు, నాట్స్ మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల, నాట్స్ న్యూజెర్సీ నాయకులు వంశీ వెనిగళ్ల తదితరులు ఈ టోర్నమెంట్ విజయవంతం కావడానికి తమ వంతు కృషి చేశారు.

తెలుగు వారిని కలిపే ఆటలైనా, సంబరాలైనా నిర్వహించడానికి నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి అన్నారు. నాట్స్ తెలుగు వారి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. పికిల్ బాల్ టోర్నమెంట్ (Pickleball Tournament) నిర్వహణలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని శ్రీహరి మందాడి అభినందించారు.

ఈ టోర్నమెంట్‌లో విజేతలకు నాట్స్ నాయకులు బహుమతులు అందచేశారు. నాట్స్ న్యూజెర్సీ విభాగం (NATS New Jersey Chapter) దిగ్విజయంగా పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించడంలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected