Philadelphia, Pennsylvania: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society – NATS) నాట్స్ ప్రతి ఏటా బాలల సంబరాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ ఫిలడెల్ఫియాలో ఘనంగా బాలల సంబరాలు నిర్వహించింది.
కేవలం ఇది ఒక వేడుకలా కాకుండా, రాబోయే తరాలకు మన భాషను, సంప్రదాయాలను వారసత్వంగా అందించే ఒక గొప్ప సంకల్పంగా ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభ ప్రదర్శనకు ఈ వేదిక ప్రాణం పోసింది. ఈ బాలల సంబరాల వెనుక ఫిలడెల్ఫియా (Philadelphia) నాట్స్ నాయకత్వ బృందం అకుంఠిత దీక్ష దాగి ఉంది.
ప్రతి చిన్న అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ (Telugu Association of Greater Delaware Valley – TAGDV) టీఏడీడీవీ ప్రతినిధులు సైతం ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ముఖ్యంగా గ్రాండ్ స్పాన్సర్ శ్రీధర్ & సుధ అప్పసాని, హరినాథ్ & రాధిక బుంగటావుల, వెంకట్ & సుజన శాఖమూరి, భువన్ & కామేశ్వరీ పక్కేర్కర్లు అందించిన ఆర్దిక సహకారం ఈ కార్యక్రమానికి వెన్నెముకలా నిలిచింది.
ఈ సంబరాల నిర్వహణలో వాలంటీర్ల (Volunteers) కృషి వెలకట్టలేనిది. ఆడియో, లైటింగ్ బాధ్యతలు చేపట్టిన రమణ రాకోతు, సురేంద్ర కోరిటల నుంచి మొదలుకొని, వేదిక సమన్వయంలో కీలక పాత్ర పోషించిన రవి ఇంద్రకంటి, వెంకట్ నాగరాజన్ వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేశారు. రామ్ రేవల్ నేతృత్వంలో సాగిన తెలుగు పోటీలు, అభినవ్ మేడి పర్యవేక్షణలోని మ్యాథ్ ఛాలెంజ్ (Math Challenge) పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
రామకృష్ణ గొర్రెపాటి, అప్పారావు మల్లిపూడి, రామ కొమ్మనబోయిన, చైతన్య పెద్దు మరియు బృందం భోజన, వసతి సౌకర్యాలను అద్భుతంగా పర్యవేక్షించగా, శ్వేత కొమ్మోజి, అక్షయ పుల్యాపుడి తమ వాక్చాతుర్యంతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. ఈ వేడుకలో భాగస్వామ్యమైన టీఏజీడీవీ (TAGDV) నాయకులు రామ్ మోహన్ తాళ్లూరి, హరీష్ అన్నబత్తిన, సురేష్ బోందుగుల తదితరులు నాట్స్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
విశ్వనాథ్ కోగంటి (Viswanath Koganti) తన కెమెరాతో ఈ అపురూప దృశ్యాలను తీశారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన అన్నపూర్ణ చాగంటి, శ్రీనివాస్ చాగంటి వంటి ప్రముఖులు విజేతలను ప్రోత్సహించారు. ఈ బాలల సంబరాల్లో విజేతలకు నాట్స్ (NATS) బహుమతులు ప్రదానం చేసింది. ఈ బాలల సంబరాలు కేవలం బహుమతుల ప్రదానానికే పరిమితం కాలేదు.
ఇది తెలుగు సమాజాన్ని ఏకం చేసింది, ఒక భాషా స్ఫూర్తిని రగిలించింది. టీమ్ వర్క్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నాట్స్ ఫిలడెల్ఫియా (NATS Philadelphia) బృందం నిలిచింది. నాట్స్ బాలల సంబరాలను ఫిలడెల్ఫియాలో దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల (Kishore Kancharla), నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి (Srihari Mandadi), నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani) ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సంబరాలకు సహకరించిన నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి (Bindu Yelamanchili), నాట్స్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచెర్లకు (Muralikrishna Medicherla) నాట్స్ ఫిలడెల్ఫియా బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.