Connect with us

Health

క్లామ్ ప్రోగ్రామ్ ద్వారా వ్యక్తిత్వ వికాసంపై నాట్స్ అవగాహన సదస్సు

Published

on

మే 26, ఫ్లోరిడా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా వ్యక్తిత్వ వికాసంపై సదస్సు నిర్వహించింది. నాట్స్ టాంపా బే విభాగం చేపట్టిన ఈ సదస్సులో ఛేంజ్ సంస్థ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ స్వామి వ్యక్తిగత జీవితాల్లో చిన్న చిన్న మార్పులు ఎలాంటి పెద్ద ఫలితాలు ఇస్తాయనేది చక్కగా వివరించారు.

గోపాలకృష్ణ స్వామి తాను రూపొందించిన క్లామ్ ప్రోగ్రామ్ ద్వారా జీవితాన్ని ఎలా ఆనందమయంగా మార్చుకోవచ్చనేది అంశాల వారీగా తెలిపారు. వాస్తవాలను గ్రహించినప్పుడే అజ్ఞాన అంధకారం తొలిగిపోయి జీవితంలో కొత్త కాంతులు వస్తాయని ఆయన అన్నారు. మనిషికి ఆధ్యాత్మికత కూడా ప్రశాంతతను, ఆనందమయ జీవితాన్ని అందిస్తుందని తెలిపారు.

మన శక్తికి మనమే పరిమితులను సృష్టించుకోవడం, ఓటమి వస్తే కుంగిపోవడం లాంటి వ్యతిరేక భావనల నుంచి బయటపడేలా గోపాలకృష్ణ స్వామి దిశా నిర్దేశం చేశారు. ఈ వెబినార్‌లో పాల్గొన్న సభ్యుల సందేహాలను గోపాలకృష్ణ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ నంద్యాల మల్లికార్జున, రమేష్ కొల్లికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది.

ఈ వెబినార్‌కు మద్దతు ఇచ్చిన నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణగంటి, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్లు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ నెట్టెం, నాట్స్ (పైనాన్స్ అండ్ మార్కెటింగ్ ) వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, వెబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సుదీర్ మిక్కిలినేని, టాంపా బే చాప్టర్ కోఆర్డినేటర్, ప్రసాద్ అరికట్ల, చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేష్ బొజ్జా తో పాటు కోర్ టీమ్ కమిటీ సభ్యులు ప్రభాకర్ శాకమూరి, సుధాకర్ మున్నంగి, అనిల్ ఆరెమండ, నవీన్ మేడికొండ, శ్రీనివాస్ బైరెడ్డి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, రమేష్ కొల్లి, రవి తదితరులు ఈ వెబినార్ విజయవంత కావడంలో తమ వంతు సహకారం అందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected