Connect with us

Associations

సేవలు ముమ్మరం చేసేలా NATS New Jersey Chapter అడుగులు, నూతన కార్యవర్గ ప్రకటన @ Edison

Published

on

Edison, New Jersey, August 12, 2024: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS.. తెలుగువారు అధికంగా ఉండే న్యూజెర్సీ (New Jersey) ప్రాంతంలో తన సేవలను మరింత ముమ్మరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా నాట్స్ న్యూజెర్సీ నూతన కార్యవర్గాన్ని నియమించుకుంది.

ముప్పై మంది సభ్యులతో కూడిన న్యూజెర్సీ నాట్స్ (NATS) నూతన కార్యవర్గం భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించింది. న్యూజెర్సీ నాట్స్ నూతన కార్యవర్గ సమన్వయకర్త మోహన్ కుమార్ వెనిగళ్ల, సంయుక్త సమన్వయకర్తగా ప్రసాద్ రావు టేకి న్యూజెర్సీ నాట్స్ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.

భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, వివిధ అంశాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసి న్యూజెర్సీ (New Jersey) లో నాట్స్ సేవలను మరింత ముందుకు తీసుకుపోయే విధంగా చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఈ సమావేశంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ న్యూజెర్సీ నాట్స్ (NATS) నాయకులకు దిశా నిర్థేశం చేశారు.

2009 లో ప్రారంభమైన నాట్స్ (North America Telugu Society) అంచెలంచెలుగా ఎదుగుతూ అమెరికాలో తెలుగువారి ఆత్మబంధువులా మారిందని నాట్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) అన్నారు. న్యూజెర్సీలో నాట్స్ సేవలను పెంచేందుకు నాట్స్ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు.

నాట్స్ న్యూజెర్సీ (New Jersey) సేవా కార్యక్రమాలు తెలుగు వారందరికి చేరువైందని నాట్స్ మాజీ అధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ (Mohana Krishna Mannava) అన్నారు. నాట్స్ ఉన్నతిలో నాట్స్ వాలంటీర్లు పోషించిన పాత్ర మరువలేనిదని తెలిపారు. నాట్స్ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి నాట్స్ నాయకత్వం గుర్తింపు ఇస్తుందని నాట్స్ న్యూజెర్సీ సమన్వయకర్త మోహన్ కుమార్ వెనిగళ్ల అన్నారు.

అందరి సహకారంతో న్యూజెర్సీలో నాట్స్ సేవలు, కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ చైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti), నాట్స్ బోర్డ్ డైరెక్టర్లు టీపీ రావు (శ్రీనివాసరావు తుమ్మలపెంట), బిందు యలమంచిలి, నాట్స్ ఆపరేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు భీమినేని, నాట్స్ మార్కెటింగ్ నేషనల్ కో ఆర్డినేటర్ కిరణ్ మందాడి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి (Media) మురళీ కృష్ణ మేడిచెర్ల, వంశీ కృష్ణ వెనిగళ్ల, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, సురేష్ బొల్లు, బస్వశేఖర్ శంషాబాద్, రాజేష్ బేతపూడి, విష్ణు ఆలూరు తదితరులు పాల్గొన్నారు.

వీరందరూ తమ అనుభవాలు తెలియచేస్తూ, నూతన కార్యవర్గానికి సూచనలు, సలహాలు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు. న్యూజెర్సీ నాట్స్ నూతన కార్యవర్గానికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) మరియు నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేక అభినందనలు తెలిపారు.

న్యూజెర్సీ నాట్స్ టీమ్ ఇదిగో

మోహన్ కుమార్ వెనిగళ్ళ, సమన్వయకర్త
ప్రసాద్ రావు టేకి, సంయుక్త సమన్వయకర్త
వెంకటేష్ కోడూరి, ప్రకాష్ కపిల, రమేష్ నెల్లూరి, మోహన్ బాబు తాళ్లూరి, వెంకట్ గోనుగుంట్ల, రవి తూబాటి, త్రినాథ్ కొండ్ర, శ్రీనివాస్ నీలం, గాయత్రి చిట్లేటి, శ్రీనివాస్ కొల్లా, సుకేశ్ సబ్బాని, ప్రశాంత్ కుచ్చు, శంకర్ జెర్రిపోతుల, ప్రసూన మద్దాలి, స్వర్ణ గడియారం, కార్తీక్ దోనేపూడి, ప్రణీత పగిడిమర్రి, ప్రవీణ్ చక్కిలం, శ్రీమాన్ పి, రాకేష్ వేలూరు, విజయ్ కుమార్ సొప్ప, రాజేష్ పెద్దిరాజు, బినీత్ పెరుమాళ్ళ, శ్రీధర్ దోనేపూడి, సురేందర్ పోలేపల్లి, శ్రీనాథ్ వడ్డే, క్రాంతి యడ్లపూడి, పవన్ గోపా, గణేష్ ధనికుల, కిరణ్ దాడి.

నూతన నాయకత్వం అందరూ తమ పరిచయాలు చేసుకుని కమ్యూనిటీ సేవల్లో భాషే రమ్యం సేవే గమ్యం అన్న నినాదానికి తగ్గట్టుగా నాట్స్ (North America Telugu Society) ను మరింత ముందుకు తీసుకెళతామని తమ దృఢ సంకల్పాన్ని తెలియచేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected