St Louis, Missouri: భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్‘ (North America Telugu Society – NATS) తాజాగా మిస్సోరిలో ఈ ఆదివారం నాడు ఫుడ్ డ్రైవ్ (Food Drive) నిర్వహించింది.
స్థానిక తెలుగు వారితో కలిసి మిస్సోరి నాట్స్ విభాగం (NATS Missouri Chapter) చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌కి మంచి స్పందన లభించింది. నాట్స్ ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఆహారాన్ని సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్ (St. Louis Foodbank) కు విరాళంగా అందించింది. నాట్స్ (NATS) ఇచ్చిన ఆహారాన్ని అనాధలకు, పేదలకు సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్ అందించనుంది.
నాట్స్ సమాజసేవలో భాగంగా డా.సుధీర్ అట్లూరి (Dr. Sudheer Atluri), రమేష్ బెల్లం (Ramesh Bellam), సందీప్ కొల్లిపర (NATS Missouri Chapter Coordinator), అన్వేష్ చాపరాల (NATS Missouri Chapter Joint Coordinator) తదితరులు చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్ పై సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్ అధికారులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని తెలిపారు. మిస్సోరీ (Missouri) లో ఫుడ్ డ్రైవ్ (Food Drive) నిర్వహించిన నాట్స్ నాయకులను, సహకరించిన వాలంటీర్లను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) మరియు నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) ప్రత్యేకంగా అభినందించారు.
ఈ నాట్స్ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమంలో సంకీర్త్ కట్కమ్ (NATS Social Media National Coordinator), నాగ శ్రీనివాస్ శిష్ట్ల, తరుణ్ దేవి, చైతన్య పుచ్చకాయల, నరేష్ రాయంకుల, సునీల్ సి స్వర్ణ, మధుసూదన్ దడ్డల, మురళి బండారుపల్లి, శ్రీయాష్ బెల్లం, బ్రహ్మ నాయుడు మోడేపల్లి, మల్లేష్ కాల్వ, అప్పల నాయుడు గండి, శివ కృష్ణ మామిళ్లపల్లి, రమేష్ కొండముట్టి తదితరులు పాల్గొన్నారు.