నాట్స్ (North America Telugu Society – NATS) అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి (బాపు) ఆధ్వర్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఆదివారం జూన్ 25న ఉచిత మెగా కంటి శిబిరం నిర్వహించారు.
పెద్ద ఎత్తున చుట్టు పక్కల తండాల ప్రజలు వచ్చి ఈ నాట్స్ (NATS) కంటి శిబిరంలో కళ్ళ పరీక్షలు చేయించుకోన్నారు. సుమారు 1000 మంది కి పైగా కంటి పరీక్షలు చేశారు. పరీక్షలు అయిన వెంటనే శంకర్ నేత్రాలయం బస్సులో శుక్లాల ఆపరేషన్ల కొరకు తీసుకువెళ్లారు.
పరీక్షలు కొరకు వచ్చిన ప్రజలకు నాట్స్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. నాట్స్ (NATS) అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి (బాపు) మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాట్స్, గ్లౌ ఫౌండేషన్ మరియు శంకర్ నేత్రాలయం సంయుక్తంగా మెగా కంటి శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు.
అలాగే ఈ కంటి శిబిరాల ద్వారా నిరుపేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్స్, మరియు కళ్ల జోళ్ల పంపిణి అందించనున్నామని తెలిపారు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాట్స్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.