Connect with us

Women

పసిఫిక్ తీరాన అంబరాన్నంటిన నాట్స్ మహిళామణుల సంబరాలు: Los Angeles, California

Published

on

కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మహిళా సంబరాలు నిర్వహించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాట్స్ ప్రతియేటా మహిళా సంబరాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌ (Long Beach) లో మహిళా సంబరాలు నిర్వహించింది.

తెలుగు మహిళలు ఆట, పాటలతో సంబరాలకు వచ్చిన వారిలో ఉత్సాహాన్ని నింపారు. 120 మంది మహిళలతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఈ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలించింది. ఆసియా యూఎస్ఎ సరోజా అల్లూరి (Saroja Alluri) ఈ ఫ్యాషన్‌ షోలో పాల్గొని ఔత్సాహికులను ప్రోత్సాహించారు.

మహిళా సంబరాల్లో శాస్త్రీయ నృత్యాలు, జానపద చిందులు, బాలీవుడ్, టాలీవుడ్ డ్యాన్స్‌లు అందరిని ఆకట్టుకున్నాయి. సంబరాల్లో భగవద్గీత (Bhagavad Gita) పఠనం కూడా మన సంస్కృతిని మరిచిపోలేమంటూ చాటి చెప్పింది. సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించిన నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగానికి నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti) ప్రత్యేక అభినందనలు తెలిపారు.

నాట్స్ హెల్ఫైలైన్ (NATS Helpline) ద్వారా తెలుగువారికి చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి అరుణ గంటి వివరించారు. తెలుగువారికి అమెరికాలో ఏ కష్టమొచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందుని భరోసా ఇచ్చారు. నాట్స్‌లో మహిళలకు అధికా ప్రాధాన్యం ఇస్తుందని, దానికి నిలువెత్తు నిదర్శనమే మా నాట్స్ ఛైర్ పర్సన్ అరుణ గంటి అని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి తెలిపారు.

మహిళల సమస్యలపై నాట్స్ ప్రత్యేక దృష్టి పెడుతుందని వారికి ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందించి తన వంతు సాయం చేస్తుందని తెలిపారు. మేలో జరగనున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా రావాలని ఈ సందర్భంగా బాపు నూతి (Bapu Nuthi) ఆహ్వానించారు.

తొలిసారిగా మహిళా క్రికెట్ టోర్నమెంట్ తెలుగు మహిళలు అన్నింటిలోనూ రాణించగలరనే విషయాన్ని స్పష్టం చేస్తూ నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం తొలిసారిగా మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది. పాల్గొన్న అన్ని జట్లు ఆడే అవకాశాన్ని కల్పించి వారిలో క్రీడా ప్రతిభను ప్రోత్సాహించింది.

అలాగే మహిళల త్రోబాల్ టోర్నమెంట్ (Throwball Tournament) కూడా నాట్స్ నిర్వహించింది. గృహహింసపై నాట్స్ అవగాహన మహిళలు ఎదుర్కొంటున్న గృహహింసపై ధైర్యంగా గళం విప్పేందుకు మహిళల్లో చైతన్యం తెచ్చేలా నాట్స్ లాస్ ఏంజిల్స్ బృందం వాక్‌థాన్ (Walkathon) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సెరిటోస్ మేయర్ మిస్టర్ చువాంగో వో పాల్గొన్నారు. అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణురాలు షారోన్ ఏంజిల్ కూడా ఈ వాక్‌థాన్‌లో పాల్గొని మహిళలు గృహహింస నుంచి బయటపడే చిట్కాలను తెలిపారు.

నేనుసైతమంటూ లాస్ ఏంజిల్స్ (Los Angeles) నాట్స్ విభాగం చలికాలంలో నిరాశ్రయులను ఆదుకునేందుకు నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. చలికాలం రక్షణనిచ్చే వస్తువులను, నిరాశ్రయులకు ఆహార పంపిణి చేసే స్వచ్ఛంద సంస్థలకు తన వంతు సాయం చేసింది. అలాగే నాట్స్ మహిళా సంబరాల ద్వారా లభించిన ఆదాయం, మహిళా సంబరాల్లో నాట్స్ యువ బృందం, ఫుడ్ స్టాల్స్ ద్వారా సేకరించిన నిధులను మాతృదేశంలోని కాకినాడ (Kakinada) పరివర్తన సంస్థకు, కర్నూలు (Kurnool) అంధుల పాఠశాలకు విరాళంగా ఇవ్వనుంది.

మహిళా సంబరాలను దిగ్విజయం చేయడంలో రాజలక్ష్మి చిలుకూరి (Rajalaxmi Chilukuri), బిందు కామిశెట్టి (ఎగ్జిక్యూటివ్‌ చైర్‌), రాధ తెలగం (మహిళా సాధికారత చైర్‌), అరుణ బోయినేని (కమ్యూనిటీ సర్వీసెస్‌), శ్యామల చెరువు, లత మునగాల, పద్మజ గుడ్ల, అనిత జవ్వాజి తదితరలు కీలక పాత్ర పోషించారు. మహిళా సంబరాల కోసం పురుషులు క్రియాశీలక పాత్ర పోషించారు.

వారిలో మనోహర్ మద్దినేని, మురళీ ముద్దన, కిరణ్ ఇమ్మడిశెట్టి, ప్రభాకర్ పరాహకోట, చంద్రమోహన్ కుంటుమల్ల, గురు కొంక, శ్రీనివాస్ మునగాల, శంకర్ సింగంశెట్టి, శ్రీపాల్ రెడ్డి, సుధీర్ కోట, హరి కొంక, కిషోర్ మల్లిన, మధు సురేంద్ర అత్తయ్య, సురిక దీవెళ్ల గరికపాటి, సురిక దీవిరెడ్డి గరికపాటి, గరికపాక సురికపాప , నరసింహారావు రవిలిశెట్టి, గౌతం పెండ్యాల, తిరుమలేష్ కోరంపల్లి, శ్రీకాంత్ అత్తోటి, రఘు తమ్మినేని, తేజ జవాది, కిరణ్ తాడిపత్రి, సతీష్ యలవర్తి, ఈశ్వర్ కాసనగొట్టు, సాయి అలియాబోయిన, ప్రసూన బసాని, రాజ్ మంచిరాజు , శాంతి బోడపాటి, డా.మురళీ రెడ్డి, వినయ కృష్ణ కొంక, తేజస్ కృష్ణ కొంక, సాయి కృష్ణ కొంక, శశాంత్ గుండాల, యశ్వంత్ తమ్మినేని,ప్రభాస్ కొల్లూరి, శ్రీజయ్ బోడపాటి, నిహారిక కొంక, సిరి గన్నా తదితరులు ఉన్నారు.

నాట్స్ (North American Telugu Society) మహిళా సంబరాల నిర్వహణలో పూర్తి మద్దతు, సహకారం అందించిన నాట్స్ బోర్డు సభ్యులు రవి ఆలపాటి, నాట్స్ నాయకులు వెంకట్ ఆలపాటికి నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected