నార్త్ అమెరికా తెలుగు సొసైటీ చికాగో చాప్టర్ (NATS Chicago Chapter) వారు నిర్వహించిన నాట్స్ లీడర్షిప్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నాట్స్ కార్యనిర్వాహక సభ్యులు, పలు ఇతర తెలుగు సంఘాల నాయకులు మరియు అతిథులతో ఆత్మీయ సమ్మేళనంలా ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మదన్ పాములపాటి గారిని నాట్స్ కార్యనిర్వాహక సభ్యులు, నాట్స్ చికాగో చాప్టర్ చాప్టర్ సభ్యులు మరియు ఇతర తెలుగు సంఘాలకి చెందిన ప్రముఖులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమం జులై 20న చికాగో లోని మాల్ ఆఫ్ ఇండియా (Mall of India) లో 450 మందికి పైగా అతిథుల మధ్య వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ బోర్డు సభ్యులు శ్రీనివాస్ అరసాడ, నేషనల్ కోఆర్డినేటర్ ఆర్కే బాలినేని, జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరీష్ జమ్ముల మరియు చాప్టర్ లీడ్ వీర తక్కెళ్ళపాటి ఘనంగా నిర్వహించారు.
నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని మరియు మాజీ అధ్యక్షులు మరియు BODs శ్రీనివాస్ మంచికలపూడి, శేఖర్ అన్నె, బోర్డు సభ్యులు రాజ్ అల్లాడ, అడ్వైజరీ బోర్డు మెంబర్ డాక్టర్ సుధీర్ అట్లూరి మరియు మాజీ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బెల్లం ఈ కార్యక్రమంలో పాల్గొని చికాగో (Chicago) టీమ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలను, వారి కృషి మరియు నిబద్ధతని మెచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో NATS తో పాటు ఇతర తెలుగు సంఘాల నాయకులు పాల్గొన్నారు. నాట్స్ సేవా కార్యక్రమాలను మరియు కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన మదన్ పాములపాటి గారిని అభినందించి, నాట్స్ తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. వీరిలో TANA సంస్థ నుండి మాజీ అధ్యక్షులు పద్మశ్రీ ముత్యాల, హేమ కానూరు, హర్ష గరికపాటి, ఉమా కటికి, కృష్ణమోహన్, హను చెరుకూరి, చిరు గళ్ళ, రవి కాకర, కృష్ణ చిట్టూరి ఉన్నారు.
అలాగే ATA సంస్థ నుండి కేకే రెడ్డి, మహిపాల్ రెడ్డి, మహిధర్ రెడ్డి, వెన్ రెడ్డి, భాను స్వర్గం, రాజ్ అడ్డగడ్డ, NATA సంస్థ నుండి రాంభూపాల్ రెడ్డి, గోపి పిట్టల, TAGC సంస్థ నుండి సంతోష్ కోడూరు, పరం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, CAA నుండి శ్వేతా చీడే, మాలతి దామరాజు, సుజాత అప్పలనేని, TTA నుండి హేమచంద్ర వీరవల్లి, మధు ఆరంభకం, GCIC నుండి వెంకట్ లింగారెడ్డి, సుగంతి, శేషు చామర్తి, సృజన్, లక్ష్మీనారాయణ తోటకూర, దీక్ష, IAGC నుండి మనోజ్ సింగంశెట్టి, మల్లారెడ్డి, CVA నుండి శ్రీనివాస్ పెదమల్లు, APTA నుండి రవి తోకల, కుమార్ నల్లం, ITServ నుండి రజిని ఆకురాతి, రమేష్ తూము, రత్నాకర్ కారుమూరి తదితరులు పాల్గొన్నారు.
చికాగో టీం (NATS Chicago Team) నుండి బోర్డు సభ్యులు శ్రీనివాస్ పిడికిటి మరియు ఈసీ మెంబర్స్ ఆర్కే బాలినేని, శ్రీ హరీష్ జమ్ముల, ఇమాన్యుయల్ నీల, మాజీ బోర్డు సభ్యులు మహేష్ కాకరాల, మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చైర్మన్ ప్రశాంత్ చికాగో చాప్టర్ టీం నుండి వీర తక్కెళ్ళపాటి, హవీల దేవరపల్లి, బిందు వీధులమూడి, రోజా చెంగలశెట్టి, భారతి పుట్ట, రజియా వినయ్, సిరి బచ్చు, అనూష కదుము, గ్రహిత బొమ్మిరెడ్డి, భారతి కేసనకుర్తి, ప్రియాంక పొన్నూరు, సింధు కంఠమనేని, చంద్రిమ దాడి, నరేంద్ర కడియాల, శ్రీనివాస్ ఇక్కుర్తి, మహేష్ కిలారు, చెన్నయ్య కంబల, నవీన్ జరుగుల, అంజయ్య వేలూరు, ఈశ్వర్ వడ్లమన్నాటి తదితరులను సత్కరించారు.
కార్యక్రమానికి వచ్చిన అతిధులను పిల్లలు తమ భరతనాట్యం తో, రవి తోకల మరియు సునీత విస్సప్రగడ తమ గాత్రంతో అలరించారు. నిర్వాహకులు రుచికరమైన భోజనాన్ని అందించిన దాతలు Bowl O Biryani కి చెందిన అరవింద్ కోగంటి మరియు గిరి మారినిలని, అలాగే వేదికనందించిన అజయ్ సుంకర, వినోజ్ చెనుమోలు మరియు ప్రమోద్ చింతమనేని, ఆకర్షణీయమైన అలంకరణలను అందించిన సంస్కృతి డెకరేషన్స్ నుండి బిందు బాలినేని ని అభినందించారు. మాధురి పాటిబండ్ల మరియు RJ క్రాంతి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ మదన్ పాములపాటి (Madan Pamulapati) గారు సభను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం చేశారు. తనను సన్మానం చేసి సత్కరించిన NATS కార్యవర్గానికి, చికాగో టీంకి, సోదర తెలుగు సంఘాలకు చెందిన నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఈ కార్యక్రమం తన తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల మధ్య జరగటం ఎంతో సంతోషాన్ని, భావోద్వేగాన్ని కలగ చేసిందని ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ నగరాల నుంచి వచ్చిన చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) కి, మాజీ చైర్మన్లు, మాజీ బోర్డు సభ్యులు మరియు బోర్డ్ మెంబర్స్ కి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన NATS ఎనిమిదవ అధ్యక్షునిగా ఎన్నికవటం ఎంతో గర్వంగా ఉందన్నారు. సామాన్య స్వచ్ఛంద సేవకుడు అధ్యక్షుడిగా ఎదగటం NATS లోనే సాధ్యం అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తన ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనతో పాటు నడిచి తనని అధ్యక్షునిగా ఎదగడంలో సహాయ సహకారాలు అందించిన ఎంతోమంది తోటి NATS కార్యవర్గ సభ్యులకు, స్నేహితులకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. 20 ఏళ్లుగా తను చేస్తున్న సేవా కార్యక్రమాలకి అండదండలుగా ఉంటూ తనని ప్రోత్సహిస్తున్న తన అర్ధాంగి సుమతికి మరియు పిల్లలు మహిత, అక్షిత లకు ధన్యవాదాలు తెలియజేశారు.
NATS అధ్యక్షునిగా తను పంచ (5) లక్ష్యాలను ఈ సందర్భంగా అతిధులతో పంచుకున్నారు. వీటిలో భాగంగా మునుపటి అధ్యక్షులు చేసిన సేవా కార్యక్రమాలను అమెరికాలో మరియు భారతదేశంలో కొనసాగించటం, ఎవరికి ఎప్పుడు ఏమి ఆపద వచ్చినా అందుబాటులో ఉండడానికి అమెరికా అంతట ప్రముఖ నగరాల్లో NATS నీ విస్తరించటం, యువతకి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో భాగం కల్పించడం మరియు వారిని NATS లో కీలక పాత్ర పోషించడానికి ఉత్సాహపరచడం, భాషే రమ్యం అనే నినాదంతో తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించేలా కృషి చేయడం మరియు సేవే గమ్యం అనే నినాదంతో ప్రవాస తెలుగువారికి సేవా హస్తం అందించడం వీటిలో ముఖ్యమైనవి.
North America Telugu Society (NATS) అధ్యక్షునిగా తన లక్ష్యాలను చేరుకోవడానికి అందరూ తమ సహాయ సహకారాలను అందించాలని, NATS Mission & Vision ని కలసికట్టుగా ముందుకు నడిపించాలని సగౌరవంగా తెలుగువారందరినీ మదన్ పాములపాటి కోరారు.