Connect with us

Literary

కథా రచనపై అవగాహన సదస్సు @ NATS తెలుగు లలిత కళా వేదిక

Published

on

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా ఆన్‌లైన్ వేదికగా కథా రచనపై (Story Writing) అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ద్వారా ప్రతి నెలా తెలుగు కళ, సాంస్కృతిక అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.

దీనిలో భాగంగానే ఈ మాసం కథా రచనపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ కథా రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తిని ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా ఆహ్వానించింది. అసలు కథ ఎలా చెప్పాలి..? కథనం ఎలా ఆసక్తికరంగా ఉండాలి..? కథల్లో ఎన్ని రకాలు ఉన్నాయి..? కథలు చెప్పే కళ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెరుగుతాయనే అంశాలను కూడా జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి వివరించారు.

తెలుగు కళలకు, సంస్కృతి పరిరక్షణకు నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) వివరించారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని తెలిపారు. కథా రచనపై అవగాహన సదస్సుకు నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి (Media) మురళీకృష్ణ మేడిచెర్ల సమన్వయకర్తగా వ్యవహారించారు.

నాట్స్ తాజా మాజీ అధ్యక్షులు బాపు నూతి, నేషనల్ కోఆర్డినేటర్ (Media Relations) కిశోర్ నారె, రవి కిరణ్ (Web) ఆన్‌లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) నాట్స్ తెలుగు లలిత కళా వేదిక (NATS Lalitha Kalaa Vedika) సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected