Guntur, September 15: అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఇటు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్ధులకు ఉచితంగా మెటిరియల్ పంపిణీ చేసింది.
నాట్స్ తాజా మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి చొరవతో ఈ 50 వేల పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు రూపొందించిన ఈ పుస్తకాలను గుంటూరులో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల (Rajendra Madala) ఆవిష్కరించారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం పోటీ పడే పేద విద్యార్ధులకు సాయం చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టిందని రాజేంద్ర మాదల అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్ధులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు (K. S. Lakshmana Rao) అన్నారు.
పేద విద్యార్ధుల కోసం బాపు నూతి చూపిన చొరవ ప్రశంసనీయమని, నాట్స్ (NATS) చేపడుతున్న సేవ కార్యక్రమాలు సమాజంలోని యువతలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయన్నారు. 50 వేల పుస్తకాలను సివిల్ సర్వీసెస్ పరీక్ష (Civil Service Exam) రాసే పేద విద్యార్ధులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన బాపు నూతి, రాజేంద్ర మాదలకు నాట్స్ (North America Telugu Society) అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati), నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ప్రత్యేక అభినందనలు తెలిపారు.