అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తాజాగా తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. దీనిలో భాగంగానే బాపట్ల జిల్లా బల్లికురవ, కొత్తపాలెం గ్రామాలకు చెందిన పంట కాలువల పూడిక కార్యక్రమాన్ని చేపట్టారు.
నాట్స్ (North America Telugu Society) అధ్యక్షుడు బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది రైతులు పాల్గొన్నారు. 250 ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందుతుంది. అలాంటి కాలువలో నీటి ప్రవాహం చక్కగా జరిగేలా పూడిక తీశారు.
NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల (Rajendra Madala) ఈ పూడిక తీత కార్యక్రమానికి కావాల్సిన ఆర్ధిక సాయాన్ని అందించడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు.జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి రాజేంద్ర మాదాల చూపిన చొరవ అభినందనీయమని నాట్స్ (NATS) అధ్యక్షుడు బాపు నూతి అన్నారు.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న రైతులకు ధన్యవాదాలు తెలిపారు. జన్మభూమి మీద ఉన్న ప్రేమతో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల (Rajendra Madala) తన సొంత గ్రామం కోసం మన గ్రామం, మన బాధ్యతగా భావించిన చేసిన కృషిని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అభినందించారు.