Connect with us

Schools

ఆంధ్ర యూనివర్సీటీ హాస్టల్‌కి NATS ఉచిత మంచాలు, ఆర్థిక సహాయం అందజేత @ Visakhapatnam

Published

on

Vizag, Andhra Pradesh: ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (NATS), గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో (GLOW), ఆంధ్ర యూనివర్సీటీ పూర్వ విద్యార్థి పూర్ణ చంద్రరావుల తాళ్లూరి ఆర్ధిక సహకారంతో మంచాలను విరాళంగా అందించారు.

ఆంధ్ర యూనివర్సీటీ (Andhra University, Visakhapatnam) లో కొత్తగా నిర్మించిన విశ్వేశ్వరయ్య వసతి గృహానికి కూడా ఆర్థిక చేయూతను అందించారు. విద్యార్ధుల (Students) నిద్రకు ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో తయారుచేసిన 432 మంచాలను తయారు చేయించి ఏయూ హాస్టల్‌కి బహుకరించారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati), నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ బోర్డు మాజీ ఈసీ సభ్యులు, శ్రీనివాస్ బొల్లు, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ అరసడ, నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, గ్లో (GLOW) సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.