Connect with us

Financial Assistance

ఆపదలో అండగా నాట్స్ హెల్ప్ లైన్ సాయం: మున్‌మున్ సాహ వైద్య ఖర్చులకు అందజేత

Published

on

డల్లాస్, టెక్సాస్: అమెరికాలో అనేక మందికి హెల్ప్ లైన్ ద్వారా సాయం చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మున్ మున్ సాహ అనే మహిళకు కూడా అండగా నిలిచింది. డెలివరీ సమయంలో ప్రాణపాయ స్థితిలోకి వెళ్లిన మున్ మున్‌ను తిరిగి కోలుకునేందుకు కావాల్సిన వైద్యం ఆమె కుటుంబానికి పెనుభారంగా మారింది. ఈ సమయంలో నాట్స్ మున్‌మున్ కుటుంబానికి అండగా నిలిచింది. ఆమె వైద్యానికి అయ్యే ఖర్చు కోసం నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా విరాళాలు సేకరించింది. ఇలా సేకరించిన విరాళాలను నాట్స్ బాలల సంబరాల వేదిక మీద మున్‌మున్ కుటుంబ సభ్యులకు అందించింది. పునరావాస కేంద్రానికి చెల్లించాల్సినవి మినహాయించి మిగిలిన 93,069.48 డాలర్ల చెక్కును నాట్స్ సభ్యులు మున్‌మున్ కుటుంబానికి అందించి ఆమె త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్న వారికి నాట్స్ అండగా నిలబడుతుందనేది మున్‌మున్ చేసిన సాయం ద్వారా మరోసారి నిరూపితమైంది.

ఈ కార్యకమంలో నాట్స్ అధ్యక్షులు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ బోర్డు సభ్యులు ఆది గెల్లి, కిశోర్ వీరగంధం, ప్రేమ్ కలిదిండి, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం, జాతీయ సమన్వయకర్త అశోక్ గుత్తా, జోనల్ వైస్ ప్రెసిడెంట్స్ భాను లంక, కిరణ్ యార్లగడ్డ, నాట్స్ డల్లాస్ టీం సభ్యులు రాజేంద్ర యనమదల, ప్రసాద్ డి వి, నాగిరెడ్డి మండల, తిలక్ వనం, చక్రి కుందేటి, మాధవి ఇందుకూరి, శ్రీకృష్ణ సల్లాం, సుచింద్రబాబు, దీప్తి సూర్యదేవర, కిరణ్ జాలాది, రాజేంద్ర కాట్రగడ్డ, మరియు ఇతర నాట్స్ డల్లాస్ టీం సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాట్స్ హెల్ప్ లైన్ టీమ్ ను చైర్మన్ శ్రీధర్ అప్పసాని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected