Connect with us

Health

భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చొరవతో నాట్స్ ఉచిత వైద్య శిబిరం @ Eluru, Kovvali

Published

on

కొవ్వలి, ఆక్టోబర్ 2: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తెలుగునాట కూడా తన సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏలూరు (Eluru) జిల్లా కొవ్వలి (Kovvali) లో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

కొవ్వలి గ్రామంలో ఏలూరు హేలాపురి రూరల్ లయన్స్ క్లబ్, వెంగి జెమ్స్ లయన్స్ క్లబ్‌, ఏలూరు ఆయుష్ హాస్పిటల్స్ నాట్స్ ఉచిత వైద్య శిబిర (Free Medical Camp) నిర్వహణకు సహాయ సహకారాలు అందించాయి. నాట్స్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉపాధ్యక్షులు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చొరవతో ఈ శిబిరం ఏర్పాటుచేశారు.

ఈ నాట్స్ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 200 మంది పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కొవ్వలి గ్రామంలో పేద రోగులందరికి షుగర్, బీపీ, గుండె, కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చక్కటి సమన్వయంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నాట్స్ దిగ్విజయంగా నిర్వహించి స్థానికుల ప్రశంసలు పొందింది.

పేద రోగులకు నాట్స్ (NATS) ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని స్థానికులు అభినందించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ నాయకులు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చేసిన కృషిని నాట్స్ చైర్ ఉమన్ అరుణ గంటి ప్రశంసించారు.

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నాట్స్ (North America Telugu Society) నినాదాన్ని చేతల్లో చూపించిన నాట్స్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉపాధ్యక్షులు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల (Bhanu Prakash Dhulipalla) ను నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected